Gun Fire: ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. డ్యూటీ విషయంలో గొడవ.. ఎస్ఐ మృతి..
Firing between CRPF jawans : ములుగు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల తుపాకులు కంట్రోల్ తప్పాయి.. మనస్పర్థలతో ఓ జవాన్ తోటి జవాన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం తాను

Firing between CRPF jawans : ములుగు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల తుపాకులు కంట్రోల్ తప్పాయి.. మనస్పర్థలతో ఓ జవాన్ తోటి జవాన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా అదే తుపాకీతో కాల్చుకున్నాడు.. ఈ ఘటనలో మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ షాకింగ్ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో ఆదివారం ఉదయం జరిగింది. బెటాలియన్‌లోని స్టీఫెన్, ఎస్ఐ ర్యాంకు అధికారి ఉమేష్ చంద్ర అనే జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో స్టీఫెన్.. ఉమేష్ చంద్రపై గన్ తో కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా అదే గన్ తలలో కాల్చుకున్నాడు.
అయితే.. సంఘటనలో ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్టీఫెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతన్ని ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్యూటీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: