AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బాబోయ్.. పోలీసులే హడలిపోయిన సీన్.. స్టేషన్‌లోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న హిజ్రాలు..

ఆర్థిక, భూ వివాదాల్లో గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవ గురించి సమాచారం అందుకుని పోలీసులు వస్తే.. భయంతో అంతా పారిపోతారు. కానీ, వీరు మాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే వీరంగ సృష్టించారు. వారి దెబ్బకు ఏకంగా పోలీసులే హడలిపోయారు. అవును, హిజ్రాలు పోలీస్ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు.

Watch Video: బాబోయ్.. పోలీసులే హడలిపోయిన సీన్.. స్టేషన్‌లోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న హిజ్రాలు..
Hijras Fighting
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 11, 2023 | 3:52 PM

Share

ఆర్థిక, భూ వివాదాల్లో గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవ గురించి సమాచారం అందుకుని పోలీసులు వస్తే.. భయంతో అంతా పారిపోతారు. కానీ, వీరు మాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే వీరంగ సృష్టించారు. వారి దెబ్బకు ఏకంగా పోలీసులే హడలిపోయారు. అవును, హిజ్రాలు పోలీస్ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. వారిలో వారే తీవ్ర ఘర్షణ పడ్డారు. కారం, రాళ్ళు, చెప్పులతో ఒకరిపై మరొకరు విరుచుకపడ్డారు. వీరి పోరు చిన్నపాటి రణరంగాన్ని తలపించింది. హిజ్రాల గ్రూప్ వార్‌తో పోలీసులు హడలెత్తిపోయారు.

ఇందుక సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నందిని, బాలమ్మ రెండు వర్గాలుగా హిజ్రాలు ఉన్నారు. వీరి మధ్య దుకాణాల వద్ద డబ్బులు వసూలు చేసే విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. నందిని గ్రూప్ లోని గంగ భవాని అనే హిజ్రా 15 రోజుల క్రితం బాలమ్మ గ్రూప్ లోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య వివాదం ముదిరింది. తమ అనుమతి లేకుండా తమ సభ్యురాలిని ఎలా చేర్చుకున్నారంటూ బాలమ్మ గ్రూప్ పై.. నందిని గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు వర్గాల హిజ్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అందరినీ కూర్చోవాలని చెప్పి ఎస్సై బయటకి వెళ్ళాడు. ఈ గ్యాప్‌లోనే రెండు వర్గాల హిజ్రాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో కొట్లాటకు దిగారు. తీవ్ర ఘర్షణలో కారం, రాళ్లు, చెప్పులు రువ్వుకున్నారు. హిజ్రాల దాడులతో పోలీస్ స్టేషన్ ఆవరణం రణరంగంగా మారింది.

వీరి కొట్లాట చూసి పోలీసులే హడలెత్తిపోయారు. ఖాకీల కళ్లముందే హిజ్రాల సిగపట్లు, కొట్లాటతో పోలీస్ స్టేషన్ హోరెత్తింది. అయితే, కాసేపటికి తేరుకున్న పోలీసులు హిజ్రాలను చెదరగొట్టారు. హిజ్రాల ఘర్షణను వారించబోయిన లేడీ హోంగార్డుకు గాయాలయ్యాయి. కాగా, పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమపై నందిని వర్గం హిజ్రాలు సూర్యాపేట, దేవరకొండ నుంచి కొంతమంది మగవారిని తీసుకొచ్చి దాడి చేయించారని గంగాభవాని అనే హిజ్రా ఆరోపిస్తోంది. హిజ్రాల వీరంగంపై ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య ముదిరిన వివాదమే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే