AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వీడు తండ్రి కాదు కసాయి.. భార్యపై అనుమానం.. నెలల పసికందును చంపి.. ఆపై..

నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం కిమ్యా తండా గ్రామానికి చెందిన కేతావత్ తిరుపతయ్య, శివలీల అలీయాస్ రాధికకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం అనంతరం కొద్ది రోజులకే ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఇరువురి మధ్య మనస్పర్థలతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త తిరుపతయ్య. తరుచు తగాదాల కారణంగా గత మూడు నెలలుగా భర్తకు దూరంగా హైదరాబాద్ లోని మియాపూర్ లోని తన తల్లి వద్దే ఉంటోంది శివలీల.

Telangana: వీడు తండ్రి కాదు కసాయి.. భార్యపై అనుమానం.. నెలల పసికందును చంపి.. ఆపై..
Telangana News
Boorugu Shiva Kumar
| Edited By: Surya Kala|

Updated on: Feb 05, 2024 | 3:32 PM

Share

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమై పసిప్రాణం బలి తీసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో కన్న తండ్రే  కన్న కూతుర్ని హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…

జిల్లాలోని బిజినపల్లి మండలం కిమ్యా తండా గ్రామానికి చెందిన కేతావత్ తిరుపతయ్య, శివలీల అలీయాస్ రాధికకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం అనంతరం కొద్ది రోజులకే ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఇరువురి మధ్య మనస్పర్థలతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త తిరుపతయ్య. తరుచు తగాదాల కారణంగా గత మూడు నెలలుగా భర్తకు దూరంగా హైదరాబాద్ లోని మియాపూర్ లోని తన తల్లి వద్దే ఉంటోంది శివలీల. అయితే భార్యకు సర్దిచెప్పి తీసుకువెళ్దామని తిరుపతయ్య హైదరాబాద్ లోని అత్తారింటికి వెళ్లాడు. అయితే తరచూ జరుగుతున్న గొడవలు, అనుమానం కారణంగా భర్తతో వెళ్లేందుకు శివలీల నిరాకరించింది. ఇదే అంశాన్ని భర్త తిరుపతయ్యకు తేగిసి చెప్పింది.

భార్యను నమ్మించి కూతుర్ని తీసుకెళ్లిన తిరుపతయ్య

భార్య రావడానికి నిరాకరించడంతో కూతుర్ని తన వెంట ఆటోలో స్వగ్రామానికి తీసుకెళ్తానని నమ్మించాడు. 14 నెలల పాపను వెంటబెట్టుకొని సొంత గ్రామానికి ఆటోలో బయలుదేరాడు. వెళ్తున్న క్రమంలో మరోసారి ఫోన్ చేసి భార్యను బతిమాలాడు. భార్య స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన తిరుపతయ్య హైదరాబాద్ శివారులో మద్యం సేవించాడు. అనంతరం బిజినపల్లి శివారులో నిర్మానుష్య ప్రదేశంలో ఆటోలో ఉన్న కన్నకూతురి గొంతు నులిమి చంపేసాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కు చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు తిరుపతయ్యను రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ