ఆస్తికోసం కొట్టుకున్న కొడుకులు.. తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె.. ఈ విషాదఘటన ఎక్కడ జరిగిందంటే..

| Edited By: Ram Naramaneni

Aug 25, 2021 | 9:02 AM

ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రాణాలు తీసుకోవడం, లేదంటే ప్రాణాలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు.

ఆస్తికోసం కొట్టుకున్న కొడుకులు.. తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె.. ఈ విషాదఘటన ఎక్కడ జరిగిందంటే..
Follow us on

Mahabubabad : ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రాణాలు తీసుకోవడం, లేదంటే ప్రాణాలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఆస్తికోసం తన్నుకుంటున్న కొడుకులను చూసి ఓ తండ్రి గుండె ఆగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకంలో చోటుచేసుకున్న తగాదా ఓ తండ్రి ప్రాణాన్ని బలిగొంది. ఆస్తి పంపకంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో అడ్డుకోబోయిన తండ్రి ప్రమాదవశాత్తు కిందపడి, గుండెపోటుతో చనిపోయిన సంఘటన చర్చనీయాంశమైంది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన మైసాలు(60)కు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. 23న ఉదయం పెద్ద కుమారుడు మహేష్, చిన్న కుమారుడు హరీష్ ల మధ్య ఆస్తి పంపకం విషయంలో వివాదం తెలెత్తింది. ఇద్దరు గొడవ పడుతుండగా, కుమారులిద్దరిని సముదాయించి అడ్డుకోబోయిన మైసాలును కుమారులు నెట్టివేయడంతో తండ్రి మైసాలు కింద పడిపోయాడు. ఆవేశానికీ లోనైన తండ్రి గుండెపోటు తో ఒక్కసారిగా కింద పడ్డాడు. అస్వస్థతకు గురైన తండ్రి నీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా లేక అస్వస్తత కారణంగా ప్రమాదవశాత్తు చనిపోయాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vizianagaram : విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం..వర్షాలు కురవాలని ఇలా చేస్తారట..

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో కట్టప్ప, ఒకప్పుడు తాలిబన్ కసాయి.. ఇప్పుడు వారికి ఆప్తమిత్రుడు..

Hyderabad: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అనిల్ కుమార్..

Adilabad: అడవి తల్లుల గోస.. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం.. టీవి9 వరుస కథనాలకు స్పందన..