AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో చిన్నపాటి మార్పు.. ఈ రోజు మీ నగరంలో ధర ఎలా ఉందో తెలుసుకోండి

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు కనిపించింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో ఇవాళ మాత్రం చిన్నపాటి మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో..

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో చిన్నపాటి మార్పు.. ఈ రోజు మీ నగరంలో ధర ఎలా ఉందో  తెలుసుకోండి
Petrol And Diesel Price
Sanjay Kasula
|

Updated on: Aug 25, 2021 | 8:59 AM

Share

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు కనిపించింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో ఇవాళ మాత్రం చిన్నపాటి మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో కూడా స్వల్ప తేడా కనిపించింది. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో తేడా ఉంది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.94గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.63గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.42గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.79గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.65గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.09గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.06 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.53గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.72 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.71 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.28 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.21 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.68లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.39గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.37గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.76 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.71లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.92 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.52కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.68గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.82 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.98 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.30ఉండగా.. డీజిల్ ధర రూ.93.61గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.32 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.34 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.56 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.29గా ఉంది.

ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే