అరగంట వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి.. అసలు విషయం తెలుసుకునేలోపే అనంతలోకాలకు పయనం..
Crime News Telangana: పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అరగంట వ్యవధిలోనే తండ్రీకొడుకులు ఇద్దరూ మృతి చెందటం ఓ కుటుంబంలో..
Crime News Telangana: పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అరగంట వ్యవధిలోనే తండ్రీకొడుకులు ఇద్దరూ మృతి చెందటం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దకొమిర గ్రామానికి చెందిన పల్కల బస్వారెడ్డి(78) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బస్వారెడ్డి గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని పెద్ద కుమారుడు వాసుదేవరెడ్డి వద్దనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వాసుదేవరెడ్డికి తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అటు చికిత్స పొందుతున్న బస్వారెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇక తండ్రి మరణ వార్త విన్న వాసుదేవరెడ్డి(44) ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. అరగంట వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఆదివారం రాత్రి ఇద్దరి అంత్యక్రియలు ముగిశాయి.
Also Read: మార్చి నుంచి పాత రూ. 100 నోట్లు రద్దు.? వివరణ ఇచ్చిన కేంద్రం..!