AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కన్నప్రేమ అంటే ఇదీ.. కనిపించని కూతురికి గుడి కట్టి పూజిస్తున్న తండ్రి.. వీడియో చూస్తే

కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఆ శూన్యాన్ని ఏదీ పూడ్చలేదు. కానీ, ఆ తండ్రి మాత్రం తన కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కాలం తన బిడ్డను దూరం చేసినా, తన మనసు నుంచి ఆమె రూపం చెరిగిపోకూడదనుకున్నాడు. అందుకే అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి కోసం ఏకంగా ఓ గుడి కట్టించాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: కన్నప్రేమ అంటే ఇదీ.. కనిపించని కూతురికి గుడి కట్టి పూజిస్తున్న తండ్రి.. వీడియో చూస్తే
Father Builds Temple For Late Daughter
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Sep 28, 2026 | 5:25 PM

Share

కన్న కూతురిని కోల్పోయిన బాధను ఆ తండ్రి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇక కళ్లముందు కనిపించదన్న నిజాన్ని అంగీకరించలేకపోయాడు ఆ తండ్రి. కూతురి రూపం ఎప్పటికీ తన కళ్లముందే ఉండాలనుకున్నాడు. అందుకే ఆమె జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు ఏకంగా ఓ గుడినే నిర్మించాడు. అందులో కూతురి విగ్రహాన్ని ప్రతిష్టించి.. దేవతను పూజించినట్టే నిత్యం పూజలు చేస్తున్నాడు. కూతురు పుట్టినరోజు, ఆమెను కోల్పోయిన రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లికి చెందిన రమేష్ అచ్చంపేటలో కోర్టు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రమేష్‌కు 2009లో వరలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. వీరికి మొదట కూతురు గీతిక 2011లో జులై 17 న జన్మించింది. అయితే కాన్పు సమయంలో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మెదడు డ్యామేజ్ అయ్యి అనారోగ్యానికి గురైంది. గీతిక మొదటి సంతానం కావడంతో అధిక ప్రేమ ఉండేది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పాపను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి 14 ఏళ్ల వయసులో 2024 అక్టోబర్ 21న గీతిక మృతి చెందింది.

అల్లారుముద్దుగా అపురూపంగా పెంచుకున్న గీతిక కళ్ల ముందు లేదని ఎంతో బాధపడ్డారు. ఆమె మృతి చెందడంతో ఆమె ఫోటో చూసుకుని కుమిలిపోయేవారు కూతురు కళ్ల ముందు ఉండాలనే తపనతో తన సొంత గ్రామంలో ఉన్న స్థలంలో గీతిక జ్ఞాపకాలతో ఆమె ప్రతిమను పెట్టుకున్నారు దేవతలను పూజించిన మాదిరిగానే రోజు గీతిక ప్రతిమ ముందు దీపాలు వెలిగిస్తున్నారు. ప్రస్తుతం ఒక పాప ఒక బాబు ఉండగా గీతికపై మమకారం పోగొట్టుకోలేక పోతున్నారు. ప్రతిరోజు ప్రతిక్షణం గీతిక జ్ఞాపకాలతో గడిపేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us