మూడు రోజులైనా పూలు వాడిపోకూడదా? ఈ ట్రిక్ మీ కోసమే!

Samatha

28 september 2026

Pic credit - Pinterest

పువ్వులు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికీ పూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటిలో పూలు ఉంటాయి

పువ్వులు

ఉదయం పూజలోకైనా, ఏదైనా శుభకార్యం, ఫంక్షన్స్‌కు వెళ్లినా దేనికి అయినా సరే పూలు అనేది అవసరం పడతాయి. ఇక ప్రతి అమ్మాయి పూలను అలంకరణగా పెట్టుకోవడానికి ఇష్టపడతుంది.

పూజ కోసం

అయితే పూలు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టుకున్నా కొన్ని సార్లు త్వరగా పాడైపోతుంటాయి. అయితే పూలు మూడు రోజులైనా వాడిపోకుండా ఉండాలి అనుకుంటున్నారా? తప్పకుండా ఈ ట్రిక్స్ పాటించాల్సిందే

పూలు పాడవ్వడం

మీరు పూలు కొని ఇంటికి తెచ్చిన వెంటనే వాటిని ప్లాస్టిక్ కవర్ నుంచి తీసి, చివరలను కట్ చేసి, స్టోర్ చేసుకోవాలంట.

కాడలు తీసి వేయడం

ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా చక్కెర, రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసం వేసి అందులో పూలను ఉంచాలి. వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

గిన్నెలో నీళ్లు తీసుకోవడం

పూల కాడలకు ఉన్న ఆకులను తీసి వేసి, నీటిలో వేసి స్టోర్ చేసుకోవాలి. దీని వలన పూలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా తాజాగా ఉంటాయి.

కాడలకు ఉన్న ఆకులు తీసి వేయాలి

మీరు నీటిలో వేసిన పూల నీటిని ప్రతి రోజూ మార్చుతూ ఉండాలి. ఇలా చేయడం వలన పూలు వెంటనే పాడవకుండా తాజాగా ఉంటాయి.

నీటిని మార్చడం

గిన్నెలో నీరు పోసి పెట్టుకున్న ఈ పూలను ఎప్పుడూ కూడా ఎండ తగిలే చోట పెట్టకూడదు. చల్లటి నీడ ఉన్న చోట ఈ పూల చెట్టు ఉండటం చాలా మంచిది.

నీడలో ఉంచడం