Telangana: పాపం..ఆ రైలు వస్తుందని ఊహించలేదేమో..ఒకేసారి తండ్రి కూతురు..

ఓ తండ్రి కూతురు రైలు దిగి పట్టాలు దాటుతుండగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తిరిగి వస్తున్న ఇద్దరు తండ్రి కూతురు ఇలా మృతిచెందడం జిల్లా వాసులను ఎంతోగాను కలిచివేసింది.

Telangana: పాపం..ఆ రైలు వస్తుందని ఊహించలేదేమో..ఒకేసారి తండ్రి కూతురు..
Khammam Train Accident
Follow us

|

Updated on: Oct 31, 2024 | 6:52 AM

ఖమ్మం జిల్లా మధిరలో రైలు దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో తండ్రి కూతురు సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మధిర మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు (52) తన కూతురు ఇదే మండలం, ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకారపు సరిత (28) తో కలిసి విజయవాడలో ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తిరిగి మధిరకు చేరుకున్నారు. విజయవాడ నుండి ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లో మధిరకు వచ్చినట్లు తెలిసింది. వీరు ట్రైన్ దిగి మల్లారం వెళ్లేందుకుగాను రైల్వే ట్రాక్‌ను దాటి వెళుతున్న క్రమంలో విజయవాడ నుండి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రీ కూతురు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతురాలు సరిత కుమారుడిగా ఉన్న పదేళ్ల బాబు పట్టాలు దాటి ప్రాణాలు దక్కించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి తక్షణమే ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పంచనామ నిర్వహించి మధిర ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచనామ నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ భాస్కరరావు తెలిపారు. మృతులు స్థానికులుగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు.  ఇది ఇలా ఉండగా దెందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాజా సాయి అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు, మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..