AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నర్సులుగా వైద్య సేవలు అందిద్దామనుకున్నారు… కానీ బొలెరో రూపంలో

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో నర్సింగ్‌ విద్యార్థులను బోలేరా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకుంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: నర్సులుగా వైద్య సేవలు అందిద్దామనుకున్నారు... కానీ బొలెరో రూపంలో
Narsing Students
Boorugu Shiva Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: May 01, 2025 | 11:24 AM

Share

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకువచ్చిన బొలెరో వాహనం ఢీ కొని ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురుకి గాయాలు అయ్యాయి.  జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ బోర్డు సమీపంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు వెళ్లిన స్టూడెంట్స్.. తరగతులు పూర్తి కావడంతో ఇళ్లు, హాస్టల్స్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కాలేజికీ సమీపంలోని రహదారి వద్ద ఉన్న రిక్వెస్ట్ బస్టాప్ వద్ద బస్సు కోసం పదుల సంఖ్యలో విద్యార్థినిలు రోజూలాగే వేచిచూస్తున్నారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా విద్యార్థినుల మీదకు బొలెరో వాహనం వేగంగా దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో మక్తల్‌కు చెందిన మహేశ్వరి (20), వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. విద్యార్థులను పొట్టనపెట్టుకున్న బొలెరో వాహనం ఎదురుగా ఉన్న కరెంట్ స్థంబాన్ని బలంగా ఢీకొని నిలిచిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో కొత్త హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో అయోమయం నెలకొంది.

ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను గద్వాల్ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హుటాహుటిన అస్పత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని అదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస రావులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఘటనతో అస్పత్రి పరిసర ప్రాంతాలు రోదనలతో మిన్నంటాయి. తోటి నర్సింగ్ విద్యార్థులంతా అస్పత్రికి చేరుకోని విద్యార్థినిల మృతి పట్ల కన్నీటి పర్యంతమయ్యారు.

ఇక ప్రమాదానికి కల కారణం అధిక స్పీడ్ ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మంగళవారం జములమ్మ అమ్మవారి పూజలు ఉండటంతో రోడ్డు ఎక్కువ రద్దీగా ఉండటం కూడా మరో కారణం అంటున్నారు స్థానికులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..