కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకపోయిన అన్నదాత.. ఏం చేశాడో తెలుసా?
రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు.. అమ్ముకునే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సరైన మద్దతు ధర లేక.. కొనేవారు లేక.. తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల్లో వివిధ షరతులు పెట్టి కొనుగోళ్లు చేస్తున్నారు. చేసేదీలేక పంటను తెగ నమ్ముకుంటున్నారు రైతులు.

నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలతో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో దళారులు తీసుకొచ్చిన ధాన్యానికి మొదట ప్రాధాన్యత ఇస్తూ, సాధారణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఓ రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి నిరసన తెలియజేశాడు. నిజమైన రైతులను ఎవరు పట్టించుకుంటారు? అంటూ రైతు వాపోయారు.
దళారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులను పట్టించు కోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పందించిన తాహసీల్దార్, రైతులతో మాట్లాడి, రైతులకు పూర్తి న్యాయం చేస్తాం.. కొనుగోలు కేంద్రంలో దళారుల ప్రమేయం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇష్టా రాజ్యంగా లోడ్ ప్రక్రియ కొనసాగుతోందని, అధికా రులు లేకుండానే ధాన్యం లారీలకు ఎక్కుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో డిసిఎంఎస్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే ధాన్యం తరలింపు జరుగుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..