Telangana: ఎద్దు మూత్ర విసర్జన చేసిందని రైతుకు ఫైన్.. డబ్బులు లేవని యజమాని ఆవేదన.. మానవత్వంతో స్పందించిన పోలీసు..

|

Dec 04, 2022 | 9:05 AM

ఎద్దు మూత్రం పోసినందుకు కూడ ఫైన్ కట్టించుకున్న వింత చోటు చేసుకుంది. మరి ఈ వింత ఫైన్ వేసింది.. ఎద్దు మూత్రం పోసినందుకు ఆ రైతు ఎంత కట్టాడో తెలుసా.. ! ఈ వింత ఘటన తెలంగాణలోని జరిగింది.

Telangana: ఎద్దు మూత్ర విసర్జన చేసిందని రైతుకు ఫైన్.. డబ్బులు లేవని యజమాని ఆవేదన.. మానవత్వంతో స్పందించిన పోలీసు..
Khammam
Follow us on

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు నాడు ఓ కవి.. నేడు కొందరు అధికారులు కాదేది.. ఫైన్‌లకు అనర్హం అంటున్నారు.  చివరకు ఎద్దు మూత్రం పోసినందుకు కూడ ఫైన్ కట్టించుకున్న వింత చోటు చేసుకుంది. మరి ఈ వింత ఫైన్ వేసింది.. ఎద్దు మూత్రం పోసినందుకు ఆ రైతు ఎంత కట్టాడో తెలుసా.. ! ఈ వింత ఘటన తెలంగాణలోని జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎద్దు మూత్రం పోసినందుకు వంద రూపాయలు ఫైన్ కట్టాడు ఓ రైతు. ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివాసముండే సుందర్ లాల్ ఎద్దుల బండితో బాడుగలు తోలుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వెళుతున్న క్రమంలో జీఎం కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. ఇది చూసిన జీఎం కార్యాలయ సిబ్బంది వెంటనే ఎద్దుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుందర్ లాల్ ను పోలీసు స్టేషన్ కు పిలిపించారు. జీఎం ఆఫీసు ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందింది.. కనుక ఎద్దుపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని చెప్పారు. పోలీసులు చెప్పింది విన్న రైతు షాక్ తిన్నాడు.. అసలు ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని పోలీసుల ఎదుట బాధపడ్డాడు. ఎద్దు మూత్రం పోసినందుకు కోర్టు అతనికి జరిమానా విధించింది. ద్దును పోషించే స్థోమతే లేని తనకు జరిమానా కట్టే శక్తి లేదని సుందర్‌లాల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

రైతు బాధను విన్న స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో తన డబ్బులతో ఫైన్ చెల్లించి రైతు సుందర్ లాల్ కు రసీదు ఇచ్చాడు. ఏది ఏమైనా ఎద్దు మూత్రం పోసినందుకు అధికారులు కేసు పెట్టి ఫైన్ విధించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..