AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విసిగిపోయాడు.. పెట్రోల్ పోసి బైక్‌ను తగలబెట్టాడు.. ఎక్కడంటే.!

అసలే కరోనాకాలం.. ఆపై పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ ధరలు.. ఇలా ఒకటేమిటి సామాన్యుడికి ప్రతీది భారంగా మారింది. వీటితో పాటు..

Telangana: విసిగిపోయాడు.. పెట్రోల్ పోసి బైక్‌ను తగలబెట్టాడు.. ఎక్కడంటే.!
Bike Fire
Ravi Kiran
|

Updated on: Aug 26, 2021 | 7:15 PM

Share

అసలే కరోనాకాలం.. ఆపై పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ ధరలు.. ఇలా ఒకటేమిటి సామాన్యుడికి ప్రతీది భారంగా మారింది. వీటితో పాటు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు కుదిబండగా మారాయి. బండిని బయటికి తీయాలంటేనే భయపడుతున్నారు. అయితే ఇక్కడో సామాన్యుడు పెట్రోల్ ధరలకు విసిగిపోయి తన బైక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది. ఈ సంఘటన జోగులంబా గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జోగులంబా గద్వాల్ జిల్లా థరూర్ మండల కేంద్రానికి చెందిన రైతు పెద్ద ఆంజనేయులు స్థానికంగా వైఎస్ఆర్ సెంటర్‌లో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న పెట్రోల్ ధరలను చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. ప్రతీ రోజూ ధరలను ఎలా పెంచుతారంటూ బంక్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్ పోయించుకున్న ఆంజనేయులు వైఎస్సార్ విగ్రహం ముందు తన బజాజ్ ప్లాటినం బైక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అక్కడే ఉన్న స్థానికులు కొంతమంది మంటల్లో కాలుతున్న బైకును చూశారు. హుటాహుటిన నీళ్ళతో మంటలను ఆర్పేశారు.

పెట్రోల్ ధరలు రోజు రోజుకూ ఇలా పెరుగుతూపోతుంటే.. తమలాంటి వాళ్లు ఎలా బ్రతకాలని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలను తగ్గించాలని.. ఒకవేళ తగ్గించకపోతే మళ్లీ తన బైకును ఇలాగే నిప్పు పెట్టి తగలబెడతానని.. తనపై పోలీసులు కేసు పెట్టినా ఫర్వాలేదంటూ ఆంజనేయులు చెప్పుకొచ్చాడు.

ఇది చదవండి: 3 ఫోర్లు, 2 సిక్సర్లు.. 300 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు.. మ్యాచ్‌కు హీరో అయ్యాడు..