కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!

తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ కాఫీ, సిగరెట్లుతో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాకెట్ ను కోదాడ చేధించారు. కంత్రీగాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!
Fake Products

Edited By:

Updated on: Apr 29, 2026 | 9:08 PM

తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ కాఫీ, సిగరెట్లుతో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాకెట్ ను కోదాడ చేధించారు. కంత్రీగాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా కొందరు కేటుగాళ్లు నకిలీ వస్తువులతో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అనుప్ అగర్వాల్, ఏపీ రాజమండ్రికి చెందిన ఏడిద సతీష్ లకు.. హైద్రాబాద్ లో పరిచయం ఏర్పడింది. ఏ వ్యాపారం చేసినా వీరికి ఆశించిన స్థాయిలో ఆదాయం లేదు. దీంతో ఈజీ మనీ కోసం ఇద్దరూ కంత్రీగాళ్ళు పథకం వేశారు. ఇదే సమయంలో రాజమండ్రికి చెందిన పావులూరి నారాయణ మూర్తి.. సతీష్ బంధువుల వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. దీంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనుప్ అగర్వాల్, సతీష్ లు సిగరెట్లు, సబ్బులు, కొబ్బరి నూనె, టీ పొడి, బ్రూ కాఫీ వంటి నకిలీ వస్తువులను ఢిల్లీ నుండి పార్సిల్ ద్వారా హైదరాబాద్ తెప్పించారు. ఈ నకిలీ వస్తువులను తెలుగు రాష్ట్రాల్లో విక్రయించే బాధ్యత సతీష్ ది. ఇలా కొన్ని నెలలుగా దందా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నాలుగు నెలల క్రితం నారాయణ మూర్తి.. కోదాడలోని వెంకటేశ్వర నగర్ లో ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. హైద్రాబాద్ నుండి నకిలీ వస్తువులను కోదాడలో డంప్ చేసి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు ఇతర సరుకులు తెచ్చి కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ ముఠా విక్రయిస్తున్న సమాచారం కోదాడ పోలీసులకు అందింది. వెంటనే పట్టణంలోని వెంకటేశ్వర నగర్ లో ఓ ఇంటిపై దాడి చేసి రూ.3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను సీజ్ చేశారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకేజింగ్ చేసి, అమాయక వినియోగ దారులను మోసం చేస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

ఈ రాకెట్ లో పావులూరి నారాయణమూర్తి, అనుప్ అగర్వాల్, సతీష్ ఏడిద అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్స్‌ కూడా తీసుకుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాణ్యతలేని పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించారు. ఈ నకిలీ రాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను వెలికితీయడానికి పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని కోదాడ టౌన్ సీఐ శివశంకర్ చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us