AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు! భక్తుడి వింత నిర్ణయం

తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పులు తీర్చలేనంటూ మాయకుంట్ల మోహన్‌ ఏకంగా చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీకి ఐపీ నోటీసు పంపారు. ఆలయ కమిటీకి చెల్లించాల్సిన రూ.3 లక్షల బకాయితో పాటు మొత్తం 56 మంది నుంచి తీసుకున్న సుమారు రూ.1.65 కోట్ల అప్పులు తీర్చలేనని పేర్కొంటూ రుణదాతలందరికీ నోటీసులు పంపారు..

దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు! భక్తుడి వింత నిర్ణయం
Goddess Gets an IP Notice
Srilakshmi C
|

Updated on: Oct 05, 2026 | 10:35 AM

Share

తాడిపత్రి, అక్టోబర్ 5: అప్పులు తీర్చలేనని సాధారణంగా వ్యక్తులు, సంస్థలకు నోటీసులు పంపడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా అమ్మోరు తల్లికి ఐపీ (Insolvency Petition) నోటీసు పంపిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే..

జిల్లాలోని యాడికి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీకి రూ.3 లక్షలు బాకీ ఉన్న మాయకుంట్ల మోహన్, ఆ మొత్తాన్ని చెల్లించలేనని పేర్కొంటూ ఐపీ నోటీసు పంపినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

56 మంది నుంచి రూ.1.65 కోట్ల అప్పులు

మోహన్‌ మొత్తం 56 మంది వద్ద నుంచి సుమారు రూ.1.65 కోట్ల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. చేసిన అప్పులను తీర్చే పరిస్థితి లేదని పేర్కొంటూ రుణదాతలందరికీ ఐపీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆలయ కమిటీకి చెల్లించాల్సిన రూ.3 లక్షల బకాయికి సంబంధించి కూడా నోటీసు పంపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వ్యక్తిగత రుణదాతలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇలాంటి నోటీసులు పంపుతుంటారు. అయితే దేవత పేరుతో ఉన్న ఆలయ కమిటీకి కూడా ఐపీ నోటీసు పంపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం యాడికిలో చర్చనీయాంశంగా మారింది. మోహన్‌ తీసుకున్న అప్పులు, ఐపీ నోటీసుల వెనుక ఉన్న పూర్తి వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us