AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela – Huzurabad: ఈటలే హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి.. వెలువడిన అధికారిక ప్రకటన

ఈటెల రాజేందర్‌ను హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో హుజురాబాద్ బైపోల్

Etela - Huzurabad: ఈటలే హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి.. వెలువడిన అధికారిక ప్రకటన
Etela
Venkata Narayana
|

Updated on: Oct 03, 2021 | 12:06 PM

Share

Etela Rajender – Huzurabad By Election: ఈటల రాజేందర్‌ను హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో హుజురాబాద్ బైపోల్ బరిలో బీజేపీ నుంచి ఈటల బరిలోకి దిగుతారా లేక, ఈటల సతీమణి పోటీలో ఉంటారా అనే మీమాంసకు తెరపడింది. కొంచెం సేపటిక్రితం ఈ సందిగ్ధతకు తెరదించుతూ ఢిల్లీ బీజేపీ పెద్దలు ఈటల పేరును ఖరారు చేశారు.

ఇక, ఈటల హుజురాబాద్‌లో మొదటి నుంచీ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందని ఈటల రాజేందర్ చెప్పుకొస్తున్నారు. నిన్న జరిగిన హుస్నాబాద్‌ ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ ముగింపు సభలో ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని దుయ్యబట్టారు.

అంతేకాదు, గడిచిన 5 నెలలుగా హుజురాబాద్‌లో మద్యం ఏరులై పారుతోందని, కోట్లు ఖర్చు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు ప్రగతి భవన్‌లో కూర్చుని కేసీఆర్ ఆదేశాలిస్తుంటే.. కొంతమంది ఆ ఆదేశాలను అమలు చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్‌లో జరుగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజానీకం అంతా తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

అయితే, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాత్రం ఈటలకు అంతసీన్ లేదంటున్నారు. హుజురాబాద్ లో గులాబీ గుబాళింపు తధ్యమంటున్నారు.

Etela Bjp

Etela Bjp

Read also: Badvel By Poll Boycott: కడప జిల్లా బద్వేల్ బై ఎలక్షన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు