Telangana: మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమం.. సరైన వైద్యం అందట్లేదంటూ ఈటల సంచలన ఆరోపణలు..

|

Feb 26, 2023 | 4:43 PM

వరంగల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి ఆరోగ్యపరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఆదివారం ప్రీతి హెల్త్‌ బులెటిన్‌‌ను నిమ్స్‌ వైద్యులు విడుదల చేశారు.

Telangana: మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమం.. సరైన వైద్యం అందట్లేదంటూ ఈటల సంచలన ఆరోపణలు..
Etela Rajender
Follow us on

వరంగల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి ఆరోగ్యపరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఆదివారం ప్రీతి హెల్త్‌ బులెటిన్‌‌ను నిమ్స్‌ వైద్యులు విడుదల చేశారు. ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వెంటిలేటర్‌, ఎక్మోపై ఆమెకు చికిత్సనందిస్తున్నట్టు హెల్త్‌ బులెటిన్‌లో స్పష్టం చేశారు. ప్రీతికి డయాలసిస్‌ చేస్తున్నట్టు బులెటిన్‌లో వివరించారు.

కాగా, నిమ్స్‌లో ప్రీతికి సరైన వైద్యం అందడం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం నిమ్స్‌కు వెళ్లి ప్రీతి కుటుంబసభ్యుల్ని పరామర్శించిన ఈటల.. మొత్తం ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు మెడికల్‌ యూజీ, పీజీ కాలేజీల్లో ఇంకా ర్యాగింగ్‌ జరుగుతుందంటూ ఈటల పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మెడికల్‌ యూజీ, పీజీ కాలేజీల్లో ర్యాగింగ్‌ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సరిపడా వైద్యులు లేరని.. దీంతో భారమంతా పీజీ విద్యార్థులపైనే పడుతోంది ఈటల పేర్కొన్నారు.