Telangana: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై ఈడీ ప్రశ్నల వర్షం.. హవాలా, మనీలాండరింగ్‌పై సుదీర్ఘ విచారణ

|

Sep 28, 2022 | 7:27 AM

Enforcement Directorate: ఎమ్మెల్యే మంచిరెడ్డి వివరణపై సంతృప్తిచెందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. మరోసారి నోటీసులిచ్చి ఇంటరాగేట్ చేసింది. ఇండోనేషియా గోల్డ్‌ మైన్స్‌లో పెట్టుబడులపై ప్రశ్నించింది. టోటల్‌గా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆర్ధిక లావాదేవీలపై సెకండ్‌ టైమ్‌ సుదీర్ఘంగా విచారించింది.

Telangana: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై ఈడీ ప్రశ్నల వర్షం.. హవాలా, మనీలాండరింగ్‌పై సుదీర్ఘ విచారణ
Manchireddy Kishanreddy
Follow us on

Enforcement Directorate: తెలుగు స్టేట్స్‌లో కలకలం రేపిన క్యాసినో కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మరోసారి ఇంటరాగేట్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. హవాలా లావాదేవీలు, మనీలాండరింగ్‌పై గురిపెట్టిన ఈడీ.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. మంచిరెడ్డి విదేశాల్లో చేస్తోన్న వ్యాపారాలపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. హవాలా, మనీలాండరింగ్‌ ద్వారా మంచిరెడ్డి లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తోంది ఈడీ. ఇదే అభియోగాలతో గతంలో ఒకసారి నోటీసులు కూడా ఇచ్చింది ఈడీ. అయితే, మంచిరెడ్డి వివరణపై సంతృప్తిచెందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. మరోసారి నోటీసులిచ్చి ఇంటరాగేట్ చేసింది. ఇండోనేషియా గోల్డ్‌ మైన్స్‌లో పెట్టుబడులపై ప్రశ్నించింది. టోటల్‌గా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆర్ధిక లావాదేవీలపై సెకండ్‌ టైమ్‌ సుదీర్ఘంగా విచారించింది.

కాగా ఎమ్మెల్యే ఫెమా రూల్స్‌ను మంచిరెడ్డి ఉల్లంఘించినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. హవాలా, మనీలాండరింగ్‌పై అనేక కోణాల్లో ప్రశ్నించిన ఈడీ, ఫైనల్‌గా మంచిరెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. అయితే, గతంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వివరణతో సంతృప్తిచెందని ఈడీ అధికారులు.. మరి, ఇప్పుడు ఎలాంటి నిర్ణయానికి వచ్చారో? మరోసారి నోటీసులిచ్చి ఇంటరాగేట్‌ చేస్తారా? ఇంతటితో సరిపెడతారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..