MLC Notification: తెలంగాణలో మళ్ళీ మోగిన ఎన్నికల నగారా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా లేఖలు సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. జనవరి 29న ఆ రెండు స్థానాలకు పోలింగ్ జరగుంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా లేఖలు సమర్పించారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరం 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 29న పోలింగ్ జరనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ కోసం కేంద్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. ఇందుకోసం జనవరి 11న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిల రాజీనామాను శాసన మండలి చైర్మన్ ఆమోదించడంతో ఆ రెండు స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జనవరి 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. వాస్తవానికి వారిద్దరి పదవీకాలం 2027 నవంబరు 30 వరకూ ఉంది. కానీ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. కొత్తగా ఎమ్మెల్సీలు ఎన్నికైనా అప్పటి వరకే కొనసాగనున్నారు.
నోటిఫికేషన్ వెలువడడంతోనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. జనవరి 18వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశముంది. జనవరి 22న నామినేషన్లను ఉపసంహరించుకోడానికి తుది గడువు. జనవరి 29న పోలింగ్ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ విడుదలః జనవరి 11, 2024
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంః జనవరి 11, 2024
నామినేషన్ల దాఖలుకు తుది గడువుః జనవరి 18, 2024
స్క్రూటినీ ప్రక్రియః జనవరి 19, 2024
నామినేషన్ల ఉపసంహరణకు గడువుః జనవరి 22, 2024
పోలింగ్ తేదీ : జనవరి 29, 2024
పోలింగ్ సమయం : ఉ. 9.00 గం. నుంచి సా. 4.00 గం. వరకు
ఫలితాలుః జనవరి 29, 2024 పోలింగ్ అనంతరం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
