తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగింది. ప్రచార హోరు పెరగడంతో రకరకాల ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు అందుతున్నాయి. ఒక పార్టీ మమ్మల్ని కించపరిచేలా ప్రచారం చేస్తుందని.. మరో పార్టీ మాపై దాడి చేశారని.. మరికొందరు ఎన్నికల నిబంధనలతో మాకు ఇబ్బంది కలుగుతున్నయని ఇలా రకరకాల ఫిర్యాదులు ఈసీ ముందుకు వస్తున్నాయి. కానీ ఈ ఒక్క వినతి మాత్రం అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేసేలా ఉంది. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి రాజకీయ నేత దగ్గర నుండి సామాన్య ప్రజానీకం వరకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఇందులో భాగంగా చాలా మంది తమ సమస్యలను కంప్లైంట్స్‌ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇందులో లాస్ట్ వీక్ బుధవారం రోజు ఓ అసోసియేషన్ ఇచ్చిన వినతి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ అసోసియేషన్ ఇచ్చిన వినతి ఏంటి? అసలు ఆ అసోసియేషన్ ఏంటి?
రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఎన్నికలు సజావుగా జరగాలాన్న కోరికతో ఈసీని ఆశ్రయించి ఎన్నికలు జరిగే రోజు నవంబర్ 30 వ తారీఖున ప్రతి పోలింగ్ స్టేషన్ బయట బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఓటరు ఎవరు ప్రలోభాలకు గురికాకుండా ఆల్కహాల్ మత్తులో ఎవరికి ఓటు వేస్తున్నాము తెలియకుండా భవిష్యత్తు ఐదు సంవత్సరాలని వృధా చేసుకోవద్దు అన్న విషయంపై ఈ వినతిని ఈసీకి అందించామని డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటున్నారు.
రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన వినతికి ఆశ్చర్యపోయినప్పటికీ ఆలోచింపచేసేలా ఉంది అని అనుకుంటున్నారు. కానీ ప్రచారంలో భాగంగా బీరు, బిర్యానీకి ఏ పార్టీ ఎంత ఇస్తుంది అని ఆలోచించే వారున్న ఈ సమాజంలో ఓటు ఆయుధాన్ని మద్యం మత్తులో వృధా చేసుకోవద్దని చెప్పే ఈ వినతి ఆలోచింపచేసేలా ఉందని పలువురు అనుకుంటున్నారు.
Drunker Welfare Association Requests Election Commission To Conduct Breathalyzer Test Outside Polling Station
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..