Hyderabad: ఎవడు మమ్మీ వీడు.! చిమ్‌టూగాడితో మందుబాబు చిందులు.. షేక్.. షేక్ ఆడించాడుగా
వాళ్లు విచక్షణ కోల్పోయి రోడ్ల మీద పడడంతోనే సరిపెట్టకుండా ఎదుటివాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. భుజం మీద కుక్కలను ఉంచుకుని, వాటిని ఉక్కిరిబిక్కరి చేస్తూ వింత పోకడలను అనుసరిస్తున్నారు. ఇది చూసి కొందరు మత్తులో ఉన్నారని విమర్శిస్తుంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

తాగితే ఈ లోకాన్నే మర్చిపోతారంటారు. మత్తులో తూలి ఎవరికీ భయపడేది లేదన్నట్లు ప్రవర్తించే బాపతు వ్యక్తులను కూడా చూస్తుంటాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది కూడా అలాంటి ఘటనే. ఫుల్లుగా మద్యం తాగి రోడ్ల మీద పడి ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టడం.. వచ్చీపోయేవాళ్లని, వెళ్తున్న వాహనాలను ఆపడం ఇదంతా మందుబాబులు సాధారణంగా ప్రవర్తించే తీరు.. పైగా అంతటితో సరిపోదు అన్నట్లు ఇక్కడ ఒక వ్యక్తి ఓ మూగజీవిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా ప్రవర్తిస్తూ ఎదుటివాళ్లను, నోరు లేని జీవాలను ఇరకాటంలో పెట్టే ఎవరినైనా అలాగే చూసీ చూడనట్లు వదిలేస్తే ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో రాత్రివేళలో ఓ విచిత్ర దృశ్యం కనబడింది. అంత రాత్రిపూట రోడ్ల మీద పడి కుక్కల్ని భుజాన ఎత్తుకొని విన్యాసాలు చేస్తున్నారు కొందరు యువకులు. గంజాయి మత్తులో ఉన్నారో.. లేక మద్యం నిషాలో ఉన్నారో తెలియదు కానీ, వాళ్లు విచక్షణ కోల్పోయి రోడ్ల మీద పడడంతోనే సరిపెట్టకుండా ఎదుటివాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. భుజం మీద కుక్కలను ఉంచుకుని, వాటిని ఉక్కిరిబిక్కరి చేస్తూ వింత పోకడలను అనుసరిస్తున్నారు. ఇది చూసి కొందరు మత్తులో ఉన్నారని విమర్శిస్తుంటే.. మరోవైపు జంతు ప్రేమికులు మూగజీవాలను హింసిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
జంతువులను ఆడిస్తూ వాటితో ప్రేమగా మెలిగితే సరే.. అందులో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, వాటిని పావులా వాడుకుని, మత్తులో తూలుతూ రోడ్ల మీద పడి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే మాత్రం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రివేళల్లో గంజాయి కొడుతూ, మద్యం తాగుతూ విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగే వాళ్లు పాతబస్తీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఇలాంటి వారిని కట్టడి చేసి, ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా, ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టకుండా గట్టి చర్యలే తీసుకోవాలని.. అప్పుడు కానీ ఇలాంటివారి తిక్క కుదరదని అంటున్నారు. మరి ఈ విషయంలో స్థానిక అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
