ముచ్చింతల్ సమతామూర్తి ప్రాంగణంలో గీత జయంతి వేడుకలు.. లైవ్ వీడియో
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరం సమతా మూర్తి ప్రాంగణంలో గీత జయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరగుతోంది.. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిచే భగవద్గీత సామూహిక పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీయర్ ట్రస్ట్ సభ్యులు, జీయర్ స్వామి భక్తులు భగవద్గీత పారాయణం చేస్తున్నారు.
హిందువుల అత్యంత పవిత్రమైన గ్రంథం భగవద్గీత అవతరణ దినంగా గీతా జయంతిని జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుద్ధ ఏకాదశి రోజున ఈ పర్వదినం నిర్వహిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు, కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ఈ సంవత్సరం డిసెంబర్ 1న గీతా జయంతి వచ్చింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా గీతాజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.,. దీనిలో భాగంగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరం సమతా మూర్తి ప్రాంగణంలో గీత జయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరగుతోంది.. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిచే భగవద్గీత సామూహిక పారాయణం నిర్వహిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో అయోమయానికి గురైన అర్జునుడికి ధర్మ జ్ఞానాన్ని శ్రీ కృష్ణుడు అందించాడు.. శ్రీకృష్ణుడు బోధనలు భగవద్గీత రూపంలో సిద్ధించి, కోట్లాది మంది భక్తులకు భగవద్గీత మార్గదర్శకంగా నిలిచింది.. గీతా జయంతి కార్యక్రమంలో జీయర్ ట్రస్ట్ సభ్యులు, జీయర్ స్వామి భక్తులు భగవద్గీత పారాయణం చేస్తున్నారు.
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

