Watch Video: ఇదేం పిచ్చి పని డాక్టరమ్మా.! రోగులను గాలికొదిలేసి.. ఫోన్‌లో గేమ్స్ ఆడుతోంది
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రోగులు బయట వేచి చూస్తున్నా పట్టించుకోకుండా.. ఓ మహిళా డాక్టర్.. మొబైల్ వీడియో గేమ్‌లో మునిగిపోయారు. అందులోనూ.. ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ తనిఖీ చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతోనే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రోగులు ఆరోపిస్తున్నారు.

రోగుల కంటే మొబైల్ గేమ్ తమకు ఎక్కువ అన్నట్టుగా వ్యవహరించింది ఓ డాక్టర్.. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున రోగులు వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చినా.. వారిని పట్టించుకోకుండా ఓ లేడీ డాక్టర్ తన స్మార్ట్ ఫోన్లో కాండీ క్రష్ గేమ్ ఆడుతూ లీనమైపోయింది. ఇతర రోగులు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డు ద్వారా రోగులను బయటే నిలిపి తాను మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది. కింది స్థాయి వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా తనకేమి పట్టనట్లు వ్యవహరించడంతో పక్కనే ఉన్న రోగులు అవాక్కయ్యారు. ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ తనిఖీ చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతోనే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రోగులు ఆరోపిస్తున్నారు.
వీడియో చూడండి..
దీనిపై టీవీ9 ప్రసారం చేసిన కథనానికి స్పందించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రఘు ఘటనపై విచారణకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ అయేషా సమకు మెమో జారీ చేశారు. విధి నిర్వహణలో ఉండగానే.. సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటంపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
