AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రేలో చూడగా..

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకల్లో డీజే సాంగ్స్‌కు డాన్స్ చేస్తూ ఓ యువకుడు స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళంలో గడ్డకట్టడంతో అతడిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్‌కు భారీ ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు.

డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రేలో చూడగా..
Dj Songs
N Narayana Rao
| Edited By: |

Updated on: May 16, 2026 | 3:52 PM

Share

డీజే ప్రాణాల మీదకు తెస్తోంది. గతంలో డీజే శబ్దాలతో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. సౌండ్ పొల్యూషన్ కారణంగా అనేకమంది అస్వస్థతతకు గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి.. తాజాగా.. ఓ యువకుడు డీజే సౌండ్స్ కు కుప్పకూలాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసకుంది.. వివరాల ప్రకారం.. గ్రామంలో పెళ్లి వేడుకలకు హాజరైన పార్ధు అనే యువకుడు స్నేహితులు బంధువులతో కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు

పెళ్లి బరాత్ లో ఏర్పాటుచేసిన డీజే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. డీజే సాంగ్స్ కు డాన్స్ చేస్తూ స్పృహ తప్పి కుప్పకూలి పోయాడు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళం లో గడ్డలు ఏర్పడటంతో ఆ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని దాదాపుగా 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ యువకుడిది నిరుపేద కుటుంబం.. దీంతో వైద్య ఖర్చులు కోసం దాతలు సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

వీడియో చూడండి..

డీజే శబ్దం వల్ల గుండె నుంచి మెదడుకు రక్తం సరఫరా చేసే నాళం గడ్డ కట్టిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్ సూచించారు. పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పనిచేయడం లేదని వైద్యులు నిర్ధారించారు.

అయితే, ఆపరేషన్ చేయించేందుకు తగ దగ్గర డబ్బులు లేవని.. దాతలు లేదా ప్రభుత్వ పెద్దలు కరుణించి.. తమ కుమారుని రక్షించాలని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ప్రదేశాల్లో తినడం వల్ల ఆర్థిక నష్టాలు.. ఈ అలవాటును ఇప్పుడే మాను
ఈ ప్రదేశాల్లో తినడం వల్ల ఆర్థిక నష్టాలు.. ఈ అలవాటును ఇప్పుడే మాను
కూలర్ సౌండ్ ఇరిటేషన్ తెప్పిస్తోందా? కొనేముందే 'ఈ ఫీచర్' చెక్ చెయ్
కూలర్ సౌండ్ ఇరిటేషన్ తెప్పిస్తోందా? కొనేముందే 'ఈ ఫీచర్' చెక్ చెయ్
SBIలో రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తే రూ.1,58,974 వడ్డీ..
SBIలో రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తే రూ.1,58,974 వడ్డీ..
పంత్ రూ. 27 కోట్ల జీతానికి భారీగా కోత పెట్టేసిన బీసీసీఐ..!
పంత్ రూ. 27 కోట్ల జీతానికి భారీగా కోత పెట్టేసిన బీసీసీఐ..!
పెళ్లిలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..
పెళ్లిలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..
అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్
అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య!
ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ 2026 ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..
ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ 2026 ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. రేపే తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. రేపే తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు
భారత్, పాక్ టెస్ట్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..? ఐసీసీ కీలక సమావేశం
భారత్, పాక్ టెస్ట్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..? ఐసీసీ కీలక సమావేశం