Watch Video: దీపావళికి కొత్త అల్లుడి రాక.. బాహుబలి విందుతో ఆశ్చర్యానికి గురిచేసిన అత్త, మామ.. వీడియో చూశారా..?
దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకొని అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్త, మామలు ఏర్పాటు చేసిన విందు భోజనం ఎంతో ఆశ్యర్యానికి గురిచేసింది. వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన జాజల తిరుపతయ్య, రేణుక దంపతులు దీపావళి పండక్కి వచ్చిన కొత్త అల్లుడికి అందించిన స్వాగతం చిరకాల అనుభూతిని మిగిల్చింది.

ఏం ట్రెండ్ రా నాయన.. ఇటీవలే అల్లుళ్లకు అత్తారింటి మర్యాదలు ఔరా అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు గోదారొళ్ల మర్యాదలే అనుకున్నాం. ఇప్పుడు ఈ మర్యాద రామన్నలు మన తెలంగాణలోనూ పెరిగిపోతున్నారు. పండక్కి కొత్త అల్లుళ్లకు రకరకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అత్తారిళ్లు – మర్యాదలు కలకాలం ఉండేలా అనుభూతుల్ని పంచుతున్నారు. దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకొని అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్త, మామలు ఏర్పాటు చేసిన విందు భోజనం ఎంతో ఆశ్యర్యానికి గురిచేసింది. వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన జాజల తిరుపతయ్య, రేణుక దంపతులు దీపావళి పండక్కి వచ్చిన కొత్త అల్లుడికి అందించిన స్వాగతం చిరకాల అనుభూతిని మిగిల్చింది. తిరుపతయ్య, రేణుకల కుమార్తె పెద్ద కూతురు శిరీషను అదే గ్రామానికి చెందిన మహంకాళి మహేశ్ కు ఇచ్చి ఐదు నెలల క్రితం అంగరంగవైభవంగా వివాహం జరిపించారు.
ఇక వివాహ అనంతరం వచ్చిన తొలి దీపావళి పండుగ కావడంతో కూతురు, అల్లుడిని ఇంటికి ఆహ్వానించారు. అయితే పండక్కి వస్తున్న కొత్త అల్లుడికి ఘనస్వాగతం పలకడంతో పాటు జీవితంలో మరిచిపోలేని విధంగా భారీ విందుభోజనం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లకు వడ్డించే విందు భోజనానికి ధీటుగా ఏర్పాట్లు చేశారు. ఏకంగా 150 రకాలకు పైగా వివిధ వంటకాలు సిద్ధం చేసి.. అల్లుడిని విందుకు ఆహ్వానించారు.
వీడియో చూడండి..
అయితే అత్తా, మామలు ఏర్పాటు చేసిన బాహుబలి విందును చూసి అల్లుడు మహేశ్ షాక్ కు గురయ్యాడు. తనపైన అభిమానంతో ఏర్పాటు చేసిన భోజనాన్ని భార్యతో కలిసి ఆరగించి.. అత్త, మామలను ఖుషీ చేశాడు. అంతేకాదు విందుభోజనం పూర్తయ్యాక వారి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. ఇక కొత్తఅల్లుడికి ఏర్పాటు చేసిన భారీ విందు భోజనం విషయం ఆనోట, ఈనోట ఊరంత తెలిసిపోయింది. ఈ కాలంలోనూ కొత్తఅల్లుడికి అత్త, మామలు చేసిన మర్యాదలు చూసి అందరూ హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




