Telangana: లోక్ సభ ఎన్నికల వేళ ఆ ఇద్దరు మంత్రుల‌ మధ్య నామినేటేడ్ రగడ..?

రాష్ట్రంలో‌ కీలక మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు మధ్య నామినేటేట్ చిచ్చు మొదలయ్యింది. ఈ ఇద్దరు నేతలకి ఉమ్మడి ‌జిల్లా పైన మంచి పట్టు ఉంది. గతంలో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని సర్దు మణిగాయి. తాజాగా నియామకం ‌అయిన నామినేట్ ‌పోస్టులలో శ్రీధర్‌బాబు ది పై‌ చేయిగా ఉంది. పొన్నం ‌ప్రభాకర్ అనుచరులకి ఒక పోస్ట్ ఇప్పించుకోలేక పొయారు.

Telangana: లోక్ సభ ఎన్నికల వేళ ఆ ఇద్దరు మంత్రుల‌ మధ్య నామినేటేడ్ రగడ..?
Congress Party

Edited By:

Updated on: Mar 21, 2024 | 10:34 AM

రాష్ట్రంలో‌ కీలక మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు మధ్య నామినేటేట్ చిచ్చు మొదలయ్యింది. ఈ ఇద్దరు నేతలకి ఉమ్మడి ‌జిల్లా పైన మంచి పట్టు ఉంది. గతంలో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని సర్దు మణిగాయి. తాజాగా నియామకం ‌అయిన నామినేట్ ‌పోస్టులలో శ్రీధర్‌బాబు ది పై‌ చేయిగా ఉంది. పొన్నం ‌ప్రభాకర్ అనుచరులకి ఒక పోస్ట్ ఇప్పించుకోలేక పొయారు. దీంతో పొన్నం అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాకి చెందిన నేతలకు నామినేటేడ్ పదవులు కట్టబెట్టే విషయంలో తనని సంప్రదించలేదని పొన్నం ప్రభాకర్ అసంతృప్తిగా‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ‌జిల్లాకి చెందిన మరో మంత్రి‌ శ్రీధర్‌బాబు అనుచరులకే రెండు నామినెటేడ్ పదవులు దక్కాయి. రాష్ట్ర ‌మహిళ‌ కమిషన్ ఛైర్ పర్సన్‎గా‌ నేరేళ్ళ శారద, కరీంనగర్‌ శాతావాహాన అర్బన్ డెవలప్మెంట్ ‌అథారిటీ ఛైర్మన్‎గా‌ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకం ‌అయ్యారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జీగా‌ పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ జిల్లాకి చెందిన ‌ఇద్దరికి నామినేటెడ్ పోస్టుల విషయంలో తనను సంప్రదించలేదని పొన్నం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.

మొదటి నుండి నేరెళ్ళ శారదకి పొన్నం ప్రభాకర్‎కి‌ మధ్య విభేదాలున్నాయి. తనతో విభేదాలు ఉన్న వ్యక్తికి నామినేటేడ్ పదవి‌ ఇవ్వడంపై పొన్నం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి‌ ఇవ్వడం పట్ల కూడా కినుక వహించినట్లు తెలుస్తుంది. ఈ నామినెట్ పోస్ట్‎లు పొంది‌న ఇద్దరూ కూడా శ్రీధర్‌బాబు వర్గీయులే కావడంతో ఇద్దరు మంత్రుల మధ్య మరింత దూరం పెంచింది. ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై రాష్ట్ర ‌కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సియం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి దృష్టికి పొన్నం తీసుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. గతంలో కూడా శ్రీధర్ బాబు, పొన్నం మధ్య విభేధాలు ఉండేవి. అయితే సంవత్సరం నుండి విభేధాలు ‌పక్కనబెట్టి పార్టీ బలోపేతం పై‌ దృష్టి పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో‌ ఇద్దరూ కూడ‌ విజయం ‌సాధించి మంత్రులు‌ అయ్యారు. మంత్రులు ‌అయిన‌ తరువాత సాఫీగా‌ సాగుతున్న ఇద్దరి మధ్య స్నేహం ఇప్పుడు ‌నామినేటేడ్ పోస్టుల భర్తీ విభేదాలకి కారణమ వుతున్నాయి. కనీసం తాను సూచించిన ఒక్కరికూడా నామినేటేడ్ పోస్ట్ ‌ఇవ్వకపోవడం‌పై పొన్నం అగ్రహాంగా‌ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సీనియారిటీ ప్రకారమే నామినేటేడ్ పోస్ట్‎లు వచ్చాయని మంత్రి‌ శ్రీధర్‌బాబు వర్గీయులు చెబుతున్నారు. పార్లమెంటు ‌ఎన్నికల ముందు ఇద్దరి మంత్రుల విభేదాలు అధిష్టానికి తలనొప్పిగా మారిందని చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..