Telangana: యాదాద్రి జిల్లాలో దారుణం.. ఆకతాయి వేధింపులకు డిగ్రీ విద్యార్థిని బలి! ఏం జరిగిందంటే..

| Edited By: Srilakshmi C

Nov 18, 2024 | 5:38 PM

ఆకతాయి వేధింపులకు డిగ్రీ విద్యార్ధిని బలైంది. ఫోన్ లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేయడంతో ఇంట్లో ఉరి పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది..

Telangana: యాదాద్రి జిల్లాలో దారుణం.. ఆకతాయి వేధింపులకు డిగ్రీ విద్యార్థిని బలి! ఏం జరిగిందంటే..
Degree Student
Follow us on

యాదాద్రి, నవంబర్‌ 18: ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా విద్యార్థులు, మహిళలపై ఆకతాయిల వేధింపులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఈ వేధింపులకు అమ్మాయిలు బలవుతూనే ఉన్నారు. తాజాగా యువకుడు వేధింపులు భరించలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన హాసిని అనే యువతి డిగ్రీ రెండవ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వలిగొండ మండలం టేకుల సోమారానికి చెందిన అఖిల్ అనే యువకుడు భువనగిరి పట్టణంలో ఉంటూ స్థానికంగా ఓ సూపర్ మార్కెట్ పనిచేస్తున్నాడు. వస్తువుల కోసం సూపర్ మార్కెట్ కు వచ్చే హాసినితో నిఖిల్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నిఖిల్ ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తుండేవాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడు.

ఈ విషయాన్ని హాసిని ఎవరికీ చెప్పుకోకుండా తనలో తానే కుమిలిపోయింది. యువకుడి వేదింపులతో విసిగిన హాసిని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి హాసిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాసినికి.. నిఖిల్ సోషల్ మీడియాలో పంపిన అసభ్యకరమైన మెసేజ్‌లను తండ్రి సతీష్ విడుదల చేశారు. నిఖిల్ వేధింపులు తాళలేక హాసిని ఉరేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ మేరకు హాసిని తండ్రి సతీష్ భువనగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.