Watch: ఇంకెన్ని చూడాలో ఏంటో.. మొన్నెమో జెర్రీ.. ఇవాళేమో ఇడ్లీలో బొద్దింక.. ఎక్కడో కాదండోయ్..
జగిత్యాలలోని రెండు హోటళ్ళలో ఇటీవల జరిగిన ఘటనలు ఆహార పరిశుభ్రతపై తీవ్రమైన ఆందోళనను రేకెత్తించాయి. ఒక టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలో బొద్దింక, మరో ఉడిపి హోటల్‌లో ఇడ్లీలో జెర్రీ కనిపించడం వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేసింది. హోటల్ యజమానుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హోటళ్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. నాణ్యత ఏమో గానీ.. పురుగులు ఉన్న ఆహార పదార్థాలను ప్రజలకు వడ్డిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. అదేంటని నిలదీస్తే.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. తాజాగా.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో.. ఇడ్లీలో బొద్దింక రావడం కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలోని ముత్తు టిఫిన్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ చేసేందుకు వెళ్లిన కస్టమర్.. ఇడ్లీ ఆర్డర్ ఇవ్వగా.. అది తినేలోపు.. బొద్దింక రావడంతో కస్టమర్ షాకయ్యాడు. అయితే.. కస్టమర్లు ప్రశ్నిస్తుండగానే టిఫిన్ సెంటర్ యజమాని ఇడ్లీని చెత్తలో పడేయడంతో.. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ విరుచుకుపడ్డారు. ఇలా చేస్తే ఎలా అంటూ యజమానిపై ఆగ్రహం వ్యక్తంచేశారు..
వీడియో చూడండి..
గతంలో కూడా జగిత్యాలలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.. ఉడిపి హోటల్ లో ఇడ్లీ తింటుండగా జెర్రీ ప్రత్యెక్షమైంది.. పిల్లలకు ఇడ్లీ తినిపిస్తున్న క్రమంలో ఇడ్లీలో జెర్రి కనిపించింది. ఇది చూసి కంగుతిన్న కస్టమర్ .. వెంటనే యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ భవన్ ఉడిపి హోటల్లో రెండు వారాల క్రితం జరిగింది. ఇక్కడ ట్టిస్ట్ ఏంటంటే.. జెర్రీ వచ్చిందంటూ కస్టమర్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా.. అది జెర్రీ కాదని వాదిస్తూ ఓనర్ దానిని నోట్లో వేసుకున్నాడు. అది జెర్రీ అని తేలడంతో ఓనర్ ఉమ్మేసి తప్పును ఒప్పుకున్నాడు..
వీడియో చూడండి..
ఏదిఏమైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..