Rain Alert: ముంచుకొస్తున్న ‘శక్తి’ తుఫాన్.. ఏపీ, తెలంగాణ తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో.. బాబోయ్.!

వామ్మో ఇవేం వానలు అంటూ ఉత్తరాంధ్ర జనం విలవిల్లాడుతున్నారు. వాయుగుండం ఎఫెక్ట్‌తో కురుస్తున్న వర్షాలు పలు జిల్లాలను బెంబేలెత్తుతున్నాయి. వర్షాలతో పాటు ఎగువనుంచి వస్తున్న వరద ఇంకాస్త వణికిస్తోంది. ఆ వివరాలు ఏంటి.? వాతావరణ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి..

Rain Alert: ముంచుకొస్తున్న ‘శక్తి’ తుఫాన్.. ఏపీ, తెలంగాణ తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో.. బాబోయ్.!
Rain Alert

Updated on: Oct 04, 2025 | 7:36 AM

బిగ్‌ అలర్ట్.! ‘ సైక్లోన్ శక్తి’ ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తొలి తుఫాన్‌… దేశ పశ్చిమ తీరంవైపు దూసుకొస్తోంది. మరి ఈ శక్తి తుఫాన్‌ ఇంపాక్ట్‌ ఎలా ఉండబోతోంది.? ఇప్పటికే వాయుగుండం ఎఫెక్ట్‌తో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలపై ఈ సైక్లోన్‌ ఎఫెక్ట్‌ ఉంటుందా.? అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. గంటకు 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ -వాయవ్య దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది.. తుఫాన్‌గా మారనుందని భారత వాతావరణశాఖ వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారవచ్చని అంచనా వేస్తూ.. ఈ తుఫాన్‌ పేరును శక్తిగా వెల్లడించింది. సైక్లోన్‌ శక్తి దూసుకొస్తుండటంతో గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో హైలర్ట్‌ ప్రకటించారు. తీవ్ర తుఫాన్‌గా మారితే ఊహించని విధంగా ఇంపాక్ట్‌ ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావారణ అధికారులు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని… ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోలేనా సంసిద్ధం కావాలని ఆదేశించారు.

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

ఇవి కూడా చదవండి

అసలేంటీ శక్తి.? ఆ పేరెలా వచ్చిందన్న విషయానికొస్తే… ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13 దేశాలు తుఫాన్‌ పేర్లను నిర్ణయిస్తాయి. భారత్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్‌, యూఏఈ దేశాలు ఆ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఈసారి తుఫాన్‌ పేరును శక్తిగా శ్రీలంక పెట్టింది. ఇటు ఏపీలో గతకొన్ని రోజుల నుంచి వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షం కుమ్మేస్తోంది.

అయితే ఈ శక్తి తుఫాన్‌ ఏపీపై ఉంటుందన్న సమాచారం లేనప్పటికీ.. ఎందుకైనా మంచిది, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మొత్తంగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తొలి తుఫాన్‌ శక్తిగా దూసుకొస్తుండటంతో భారత వాతావరణశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుఫాన్‌ను ప్రతిక్షణం అంచనా వేస్తూ తీర ప్రాంత రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది.

ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే