AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నా భార్య టార్చర్ బరించలేకపోతున్నా.. అమ్మా, బాపు జాగ్రత్త.. నటుడి సెల్ఫీ వీడియో చూస్తే కన్నీళ్లే..

జానపద ఇండస్ట్రీలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. తన భార్య వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ రాజూ సెల్ఫీ వీడియో తీసుకుని తుదిశ్వాస విడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: నా భార్య టార్చర్ బరించలేకపోతున్నా.. అమ్మా, బాపు జాగ్రత్త.. నటుడి సెల్ఫీ వీడియో చూస్తే కన్నీళ్లే..
Viral Video
G Sampath Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 04, 2025 | 7:30 AM

Share

జానపద ఇండస్ట్రీలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. తన భార్య వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ రాజూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవలే అతని అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కాగా రాజూ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటకు చెందిన రాజు జానపద పాట వీడియోలు చేస్తుండేవాడు. అయితే ఆరు నెలల క్రితమే రాజూ ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ అతను జీవితం అనుకున్నట్టు సాగలేదు. పెళ్లైన ఆరు నెలలకే అతను పెద్ద బతుకమ్మ పండక్కి భార్య కోసం కొన్న చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు.

రాజూ సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. అమ్మా, బాపు.. బతకలేకపోతున్నా.. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నాకు టార్చర్ అనిపిస్తోంది. నా భార్య మిమ్మల్ని ఊకె తిడ్తది. నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లయిపోయింది. అన్నా, వదినా.. పిల్లలు జాగ్రత్త. సౌందర్య ఇక నువ్వు మంచిగ బతుకు. నీలాంటి ఆమెకు మొగోళ్లు సెట్ అవ్వరు. నువ్వ అన్న మాటలకు నాకు మెంటల్ టార్చర్ అయితుంది. నాకు ఈ బతుకు బతకబుద్ధవట్లేదు. నాకు బట్టలు తీసుకోవడానికి డబ్బులు లేకపోయినా.. భార్య కోసం కొత్త చీర కొన్నా.. అమ్మా, బాపు బై జాగ్రత్త అని రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Moiz Bhai (@moees_bhai_1)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.