Cyber Crime: వాట్సాప్, క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ ద్వారా సైబర్ కేటుగాళ్ల కొత్త తరహా మోసాలు.. బీ కేర్ ఫుల్.!
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మరీ
WhatsApp – Cyber Crime: సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. బిట్ కాయిన్ – ఎం8 పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చాంద్రాయణగుట్టకి చెందిన షేక్ నసీబుద్దీన్ ఫోన్ నెంబర్ ను అందులో యాడ్ చేశారా మాయగాళ్లు.
బిట్ కాయిన్ వ్యాపారంపై ట్రైనింగ్ ఇస్తున్నట్టు నసీబుద్దీన్‌ను మభ్యపెట్టారు. ఇలా అతడి నుండి పలు విడతలుగా మొత్తం 14 లక్షలకు పైగా కాజేశారు కేటుగాళ్లు. డబ్బులు కాజేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్ డిలీట్ చేశారు. దీంతో లబోదిబోమంటూ సిటీ సైబర్ క్రైమ్స్‌లో బాధితుడు నసీబుద్దీన్ ఫిర్యాదు చేశాడు.
ఇదిలాఉంటే, హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన బిజినెస్ ఉమెన్ రేఖకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ రెండు క్రెడిట్ కార్డుల నుండి ఆమెకు తెలియకుండానే ₹5.70 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. క్లోనింగ్ ద్వారా కేటుగాళ్లు నకిలీ కార్డులు సృష్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.