Gold Smuggling: మీ తెలివి తెల్లారా.. బంగారాన్ని ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తార్రా

విదేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా తరలించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

Gold Smuggling: మీ తెలివి తెల్లారా.. బంగారాన్ని ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తార్రా
Gold
Follow us
Aravind B

|

Updated on: May 02, 2023 | 4:36 PM

విదేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా తరలించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే దుబాయ్ నుంచి ఇండియాకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులు తెలివిగా బంగారాన్ని తరలించేందుకు యత్నించారు. అనుమానంతో వాళ్లని గమనించిన కస్టమ్స్ అధికారులు వాళ్ల బ్యాగులు తనిఖీ చేశారు. అయితే చాక్లెట్ల మధ్యలో 13 ముక్కలుగా అమర్చిన బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..