Telangana Vaccination: వేగవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. మరో మైలురాయి అధిగమించిన తెలంగాణ

Covid-19 vaccination: తెలంగాణ సర్కార్ సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారంతో రాష్ట్రంలో కోటి డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కోటి 53 లక్షల 358 మందికి టీకాలు వేశారు.

Telangana Vaccination: వేగవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. మరో మైలురాయి అధిగమించిన తెలంగాణ
Vaccination
Follow us

|

Updated on: Jun 25, 2021 | 9:05 PM

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండొచ్చన్న నిపుణుల సూచనలతో.. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోవిడ్‌-19 టీకా డ్రైవ్‌లో మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కోటి 53 లక్షల 358 మందికి టీకాలు డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

మరో వైపు… తెలంగాణ వ్యాప్తంగా జులై 1 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్‌ అవుతుండడంతో అధ్యాయులకు వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి అన్ని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది వైద్య శాఖ. వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ అధికారిని నియమించింది విద్యాశాఖ. ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో 100 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, మోడల్‌, గురుకుల విద్యాలయాల్లో బోధనా సిబ్బంది శుక్రవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ కోసం అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం లక్ష మంది టీచర్లకు టీకాలు వేయించాలని విద్యాశాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఉపాధ్యాయులతోపాటు బోధనేతల సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక సెంటర్లలో ఉపాధ్యాయులకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించేందుకు ఇన్‌ఛార్జ్ నియమించారు అధికారుల.

ఇవి కూడా చదవండి : Minister Jagadish Reddy: ద్రోహం చేయడం వారికి ముందు నుంచే అలవాటు.. ఏపీ ప్రాజెక్టులపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

బ్యాంక్ మునిగిపోయినప్పుడు మీ డబ్బుకు రక్షణ ఉంటుందా… ఆర్బీఐ ఏం చెబుతోందంటే…

Bonalu: బోనాలా జాతరకు భారీ ఏర్పాట్లు.. ఈ ఏడాది ఏనుగు ఊరేగింపు ఉంటుందన్న మంత్రి తలసాని

Twitter Denied: కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్ షాక్… గంట పాటు అకౌంట్​ యాక్సెస్ తొలిగింపు..