Minister Jagadish Reddy: ద్రోహం చేయడం వారికి ముందు నుంచే అలవాటు.. ఏపీ ప్రాజెక్టులపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
Minister Jagadish Reddy: సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులే తెలంగాణలో కరువును సృష్టించారిని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల పై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే తెచ్చినా...
సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులే తెలంగాణలో కరువును సృష్టించారిని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల పై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే తెచ్చినా… ఆ రాష్ట్ర పాలకులు పనులు జరిపిస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి- కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై త్వరలోనే ఉద్యమించే సమయం దగ్గరలోనే ఉందన్నారు. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఆంధ్రా పాలకులకు ముందు నుంచి ఉన్న అలవాటేనని అన్నారు. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి దోపిడీ చేశారని విమర్శించారు. ఇవ్వాళ మాట్లాడుతున్న నాయకులందరూ ఆనాడు YSR వెంట ఉండి తెలంగాణకు ద్రోహం చేసినవారే అని విమర్శించారు.