Ministers review on seasonal diseases: తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. తెలంగాణలో ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని హరీశ్‌రావు సూచించారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలంటూ మంత్రి కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సోమవారం పలువురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పరిశుభ్రతపై ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టంచేశారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని.. పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. దీనికనుగుణంగా అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సైతం సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హరీశ్ రావు కోరారు.
Addressing the press conference from BRKR Bhavan on Seasonal Diseases https://t.co/xLeltlFFRk
— Harish Rao Thanneeru (@trsharish) July 25, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..