AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కన్నీరు పెట్టించే ఘటన.. ఒడిలోని బిడ్డకు పాలిస్తూనే.. మృత్యుఒడిలోకి

ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. అటు అత్తారింట్లో, ఇటు పుట్టింట్లో అందరూ హ్యాపీ. ఎంత సంతోషం అంటే.. ఆమె అమ్మానాన్నలు, అత్తామామలు కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఊహించని విషాదం వెంటాడింది.

Telangana: కన్నీరు పెట్టించే ఘటన.. ఒడిలోని బిడ్డకు పాలిస్తూనే.. మృత్యుఒడిలోకి
Mother Died
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2022 | 3:48 PM

Share

Tragedy: ఇది చాలా హృదయ విదారక ఘటన. ఒడిలోని బిడ్డకు పాలిస్తూనే.. మృత్యుఒడిలోకి  వెళ్లిన ఓ మాతృమూర్తి జీవిత కథ. ఈ స్టోరీ మొత్తం చదివితే మీ హృదయం బరువెక్కుతుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా(nagarkurnool district) తిమ్మాజిపేట(thimmajipet) మండలం నేరళ్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యామిలీ మెంబర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపూర్‌ మండలం తిర్మలాపూర్‌ విలేజ్‌కి చెందిన 25 ఏళ్ల జయశ్రీ  మొదటి కాన్పు కోసం నేరళ్లపల్లిలోని అమ్మగారింటికి వచ్చింది. 2 నెలల కిందట పండంటి ఆడబిడ్డను కన్నది. ఇటీవల జయశ్రీకి ఒంట్లో బాలేదు. నలతగా ఉండటంతో భర్త ప్రశాంత్‌ తిర్మలాపూర్‌ నుంచి శనివారం వచ్చి మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆమె గుండె వాల్వులో చిన్న సమస్య ఉందని తెలిపారు. మెడిసిన్ వాడితే నయమైపోతుందని వివరించారు. దీంతో డాక్టర్లు రాసిచ్చిన మందులు తీసుకుని మళ్లీ నేరళ్లపల్లికి తీసుకొచ్చారు. ఆదివారం మార్నింగ్ 5.30 గంటల సమయంలో జయశ్రీ తన బిడ్డకు పాలిస్తూ.. అలాగే తుదిశ్వాస విడిచింది.

కొద్దిసేపటి తర్వాత తాత, అమ్మమ్మ టీ కోసం పిలిచినా ఆమె గదిలో నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఏమైందా అని వెళ్లి చూడగా.. చనిపోయినట్లు గుర్తించి గుండెలవిసేలా రోదించారు. జయశ్రీ పేరెంట్స్, అత్తమామలు తీర్థయాత్రలకు తమిళనాడు వెళ్లడంతో.. వృద్ధులు వెంటనే ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు. బిడ్డ పుట్టిన 2 నెలలకే భార్య మృతి చెందండంతో అతను కూడా తీవ్ర మనో వేదనకు గురయ్యాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..