Hyderabad: భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో ఫ్లైఓవర్..

ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి ప్రారంభం కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి..

Hyderabad: భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో ఫ్లైఓవర్..
Core City Link Roads For Hyderabad
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 21, 2023 | 2:34 PM

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు దశల వారిగా పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్‌ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటి, పరిశ్రమలు శాఖామంత్రి కేటిఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి ప్రారంభం కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా చొరవ చూపడం జరిగింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా వాటిలో ఎల్బీనగర్ ఆర్.హెచ్.ఎస్ ఫ్లైఓవర్ 19గా అందుబాటులోకి రానున్నది.

ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులు కాగా జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన పనులలో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనులలో మూడు పూర్తికాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో కలవు. గోల్నాక నుండి అంబర్ పెట్ వరకు గల ఫ్లైఓవర్ జాతీయ రహదారుల శాఖ ద్వారా ఉప్పల్ జంక్షన్ నుండి సి.పి.ఆర్.ఐ (మేడిపల్లి) వరకు గల ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ వరకు చేపట్టనున్న ఈ రెండు 6 లైన్ల ఫ్లైఓవర్లను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టారు. అట్టి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది.జి హెచ్ ఏం సి కి సంభందించిన రూ. 2335.42 కోట్ల విలువ గల వివిధ రకాల10 పనులలో ఫ్లై ఓవర్ లు, ఇతర పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగినది.

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ ఆర్ హెచ్ ఎస్ ఫ్లై ఓవర్ ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్ తో పాటు భూసేకరణతో సహా మొత్తం రూ.32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుండి వచ్చే ప్రజలతోపాటు నగర వాసులకు హయత్ నగర్ మీదుగా నగరంలో ఇతర ప్రాంతాల వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది. 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వలన వాహన వేగం కూడా పెరుగనున్నది ఎల్ బి నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..