Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మళ్లీ షోకాజ్ నోటీసు.. ఈసారైనా వివరణ ఇస్తారా..?
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మళ్లీ షోకాజ్ నోటీసు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. గత నెల 22న నోటీస్ ఇచ్చినా సమాధానం ఇవ్వని కోమటిరెడ్డి వెంటకటరెడ్డి. అయితే ఈనెల 1తో ముగిసిన గడువు.. మళ్లీ వివరణ కోరిన కమిటీ. మొదటి నోటీస్ అందలేదన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యాలయం.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం శుక్రవారంనాడు మరోసారి షోగస్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీలోపుగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోరింది. గత మాసంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వకపోడంతో పార్టీ మరోసారి పంపించింది. అస్ట్రేలియా పర్యటనలో ఉన్నందున ఈ షోకాజ్ నోటీసు అందలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయవర్గాలు కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇవ్వడంతో మరోసారి షోకాజ్ నోటీసు అందించారు. గత నెల 22న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్ల్రేలియా పర్యటనలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన మరునాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్ట్రేలియా నుంచి హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ నెల 1వ తేదీతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. కానీ ఆయన మాత్రం సమాధానం ఇవ్వలేదు. షోకాజ్ నోటీసు అందలేదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయం సమాచారం ఇచ్చిందని సమాచారం. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ సంఘం ఇవాళ మరోసారి నోటీసును జారీ చేసింది.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తన అనుచరరులకు ఫోన్ చేసి ఈ దఫా బీజేపీకిఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేసిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అస్ట్రేలియా టూర్ లో ఉన్న సమయంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడ సంచలనంగా మారాయి. ఈ రెండు అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం