తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీలతో పాటూ కొన్ని కీలకమైన పథకాలను కాంగ్రెస్ నిన్న తన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. బీజేపీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతికి క్యాంపెయిన్ స్టార్‌గా కీలక బాధ్యతలు అప్పగించడం అందరిని షాక్‌కి గురిచేసింది. బీజేపీ తెలంగాణ ఎన్నికల ప్రచారకులుగా పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ ఆడబిడ్డ విజయశాంతి పేరు లేకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి ఎలాంటి గౌరవం ఇస్తుందో చెప్పేందుకు ఉదాహరణే ఈ కీలకమైన బాధ్యత అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమెతో పాటూ కన్వీనర్ల జాబితాలో మల్లు రవి, కోదండ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజాగా కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీని నియమించింది. దీనికి సంబంధించిన ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది ఏఐసీసీ. ఇందులో విజయశాంతికి కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా కీలక పగ్గాలు అప్పగించారు. అంతేకాకుండా కమిటీ కన్వీనర్లుగా 15 మంది నేతలను నియమించారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా ప్రచారం చేస్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా మొదలు క్యాంపెయింన్ స్టార్స్ వరకూ ఒక్కో పార్టీ ఒక్కో రకంగా వ్యవహరిస్తోంది. కొందరు ముందు మ్యానిఫెస్టో ప్రకటించి ప్రచారానికి వెళ్తుంటే.. ప్రచార కమిటీ సభ్యులను ప్రకటించి మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్‌కు అన్నీ తానై సీఎం కేసీఆర్ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇటు కేటీఆర్ కూడా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ అయితే ఇప్పటికే ఎన్నికల క్యాంపెయిన్ జాబితాను విడుదల చేసింది. మన్నటి వరకూ మోదీ, అమిత్ షాలు వరుసగా తెలంగాణలో సభలు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం బీజేపీ అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..