Sonia Gandhi: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాగాంధీ దూరం.. డాక్టర్‌ సలహా మేరకు పర్యటన రద్దు..!

|

Jun 01, 2024 | 12:23 PM

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లికి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అనారోగ్యం కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది.

Sonia Gandhi: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాగాంధీ దూరం.. డాక్టర్‌ సలహా మేరకు పర్యటన రద్దు..!
Sonia Gandhi Revanth Reddy
Follow us on

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా వస్తారా? రారా? అంతకంటే ముందే ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయితే తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు. చివరికి ఆమె వ్యక్తిగత కారణాలతో సోనియా గాందీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది.

జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వలో జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లికి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అనారోగ్యం కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఆదివారం సోనియా గాంధీ తెలంగాణకు రావాల్సి ఉంది. వైద్యుల సూచన మేరకు తెలంగాణ పర్యటనకు రాలేకపోతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…