Telangana: ఆ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థి ఎవరు.. ప్రకటించేందుకు ఇరుపార్టీల తర్జనభర్జన..
ఆ ఒక్క సీట్ రెండు పార్టీలను తెగ కలవర పెడుతోంది. ఆ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులను ప్రకటించడానికి రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాళ్లుగా మారిన ఆ పార్లమెంట్ స్థానం ఎక్కడంటే? మెదక్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించడం సవాలుగా మారిందట బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు.
ఆ ఒక్క సీట్ రెండు పార్టీలను తెగ కలవర పెడుతోంది. ఆ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులను ప్రకటించడానికి రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాళ్లుగా మారిన ఆ పార్లమెంట్ స్థానం ఎక్కడంటే? మెదక్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించడం సవాలుగా మారిందట బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు. ఆ పార్టీల నుండి ఇక్కడ అభ్యర్థి పెట్టడానికి తర్జనభర్జన అవుతున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ రెండు పార్టీలకు మంచి పట్టు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవి ఏమి పనిచేయడం లేదు. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో మీనామేషాలు లెక్కిస్తున్నాయి. దీనికి కారణం ఇక్కడ ఎలాగైనా గెలవాలి అని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ సీట్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ముందు ఒక పార్టీ ప్రకటిస్తే, ఆ అభ్యర్థిని చూసి ఇంకో పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి వేచి చూస్తున్నాయి. నలభై ఏళ్ల కిందట దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1979-84 మధ్యకాలంలో దివంగత నేత ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి దేశ ప్రధానిగా కొనసాగారు. తదనంతరం ఈ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత మాజీ మంత్రి ఎం. బాగారెడ్డి రెండు దశాబ్దాలు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం మొదలవడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే..
ఉద్యమం నుండి ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీకి వరుస విజయాలు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని ఆ ఎన్నికలలో టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) అభ్యర్థి, దివంగత ఆలె నరేంద్ర గెలిచారు. ఆ తర్వాత పొత్తు లేకపోయినా 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ విజయం సాధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నిక సవాల్‌గా నిలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందుకే మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం తర్జనభర్జన పడుతోంది. గతంలో కాంగ్రెస్‌కు బలంగా ఉన్న మెదక్ పార్లమెంట్‌ను, తెలంగాణ ఉద్యమం ఫలితంగా బీఆర్ఎస్కి పెట్టని కోటగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఉన్నారు. వీరిని ఎదుర్కొని ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బలమైన నేతను పెట్టాలనే ఆలోచినలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టు ఉందని.. దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోవాలనే ఆలోచనలో ఉంది కారుపార్టీ. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది తేలిపోయింది కావున.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని, ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉందని, దాన్ని పోగొట్టుకోకుండా ఈ పార్లమెంట్ పరిధిలో మళ్ళీ విజయం సాధించాలని బీఆర్ఎస్ వ్యూహలు రచిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..