TS - TG: కొత్త కోడ్‌తో ఆర్టీఏకు కాసుల పంట.! తొలిరోజే భారీగా ఆదాయం

TS – TG: కొత్త కోడ్‌తో ఆర్టీఏకు కాసుల పంట.! తొలిరోజే భారీగా ఆదాయం

Anil kumar poka

|

Updated on: Mar 18, 2024 | 4:04 PM

వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త కోడ్‌ రవాణా శాఖకు కాసులు కురిపించింది. కోడ్‌ ప్రారంభమైన తొలిరోజే గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రూ.2.51 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.1.32 కోట్లు మూడు జిల్లాలనుంచే సమకూరడం విశేషం. అన్ని కార్యాలయాల్లో TGతో పాటు 0001 కొత్త సీరిస్‌ ప్రారంభం కావడంతో..

వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త కోడ్‌ రవాణా శాఖకు కాసులు కురిపించింది. కోడ్‌ ప్రారంభమైన తొలిరోజే గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రూ.2.51 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.1.32 కోట్లు మూడు జిల్లాలనుంచే సమకూరడం విశేషం. అన్ని కార్యాలయాల్లో TGతో పాటు 0001 కొత్త సీరిస్‌ ప్రారంభం కావడంతో.. ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవడానికి వాహనదారులు ఆసక్తి చూపించారు. ఆన్‌లైన్‌లో పోటాపోటీగా బిడ్డింగ్‌ చేశారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ పరిధిలో టీజీ09 0001 నంబరు ఏకంగా రూ.9,61,111 ధర పలికింది. రాజీవ్‌కుమార్‌ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ఈ ఫ్యాన్సీ నంబరు దక్కించుకున్నారు. రానున్న రోజుల్లో ఫ్యాన్సీ నంబర్లకు మరింత డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖైరతాబాద్‌, టోలిచౌకి, మలక్‌పేట, బండ్లగూడ, తిరుమలగిరి, అత్తాపూర్‌, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌లో కొత్త కోడ్‌తో అధికారులు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించారు. ఫ్యాన్సీ సిరీస్‌ నంబర్ల కోసం అధికారులు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ నిర్వహించగా.. విశేష స్పందన వచ్చింది. 0009, 0999 లాంటి నంబర్లను పోటీపడి మరీ దక్కించుకున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్‌ కోడ్‌తోనే రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 15రోజుల వరకు పాత స్లాట్లు నడుస్తాయి. కొత్తవాహనాలు కొనుగోలు చేసినవారికి మాత్రం టీజీ కోడ్‌తో సిరీస్‌ కేటాయిస్తున్నారు. పాత విధానం ప్రకారమే నంబర్లకు నిర్ణీత ఫీజు ఉంటుందని హైదరాబాద్‌ JTC రమేష్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..