AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన అజ్ఞాత వ్యక్తి.. అతడ్ని చూడగానే స్టూడెంట్స్ షాక్.. ఆ తర్వాత

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని సిర్సవాడ జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా అవాక్ అయ్యారు. 10వ తరగతి విద్యార్థులకు కొత్త లెక్కల మాస్టారు పాఠాలను బోధించారు. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా... ఆ లెక్కలను బోధించిన మాస్టారు ఏకంగా జిల్లా మెజిస్ట్రేట్ కావడం విశేషం.

Telangana: క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన అజ్ఞాత వ్యక్తి.. అతడ్ని చూడగానే స్టూడెంట్స్ షాక్.. ఆ తర్వాత
Trending
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jul 04, 2025 | 1:55 PM

Share

గురువారం ఉదయం సిర్సవాడ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. మధ్యాహ్న భోజన నాణ్యతపై పరిశీలించి… విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠశాలలో నిర్వహణ, శుభ్రత, మధ్యాహ్న భోజన నాణ్యత వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇక మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రధానోపాధ్యాయులు, వంటగదిలో పనిచేసే సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని, మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోటు పుస్తకాలను విద్యార్థులకు అందరికీ అందించారా లేదా అని విద్యార్థులతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై, వారితో స్వేచ్ఛగా మాట్లాడుతూ, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు వేయడం ద్వారా వారి అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ సేకరించారు.

ఇక నేరుగా 10వ తరగతి గదికి వెళ్లి అక్కడ విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. వారితో లెక్కలు చేయించి సందేహాలు తీర్చారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్కల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తు చేసుకుంటూ… ఆ అంశాలను విద్యార్థులతో పంచుకుంటూ బోధించారు. అనంతరం సీజనల్ వ్యాధుల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, రోగాల బారి నుంచి తమను తాము రక్షించుకోవడంలో అవసరమైన జాగ్రత్తలు పాఠశాలల్లోనే కాకుండా ఇంట్లో కూడా పాటించాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ పాఠాలు చెప్పడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. లెక్కలు చేయించి, సందేహాలను చక్కగా నివృత్తి చేయడం చూసి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ్టి క్లాస్ ను తాము ఎప్పుడూ మర్చిపోము అని విద్యార్థులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి