AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. RRR, రేడియల్‌ రోడ్లపై చర్చ

స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రోడ్ మ్యాప్‌ సిద్ధం చేసింది. ఆ రోడ్ మ్యాప్‌ ప్రకారమే..

Telangana: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. RRR, రేడియల్‌ రోడ్లపై చర్చ
Cm Revanth & Nitin Gadkari
Ravi Kiran
|

Updated on: May 06, 2025 | 8:39 AM

Share

స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రోడ్ మ్యాప్‌ సిద్ధం చేసింది. ఆ రోడ్ మ్యాప్‌ ప్రకారమే ఓవైపు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే… మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి సర్కార్‌ సహకరించడం లేదంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇదే టైమ్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ కావడం ఇంట్రస్టింగ్‌గా మారింది. మరి సమావేశంలో డిష్కషన్‌కు వచ్చిన పాయింట్స్‌ ఏంటి..?

తెలంగాణకు రోడ్డు మ్యాప్‌ సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. అప్పట్లో సహకరించలేదని బీఆర్‌ఎస్‌పై… ఇప్పుడు కలిసి రావడం లేదని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది. మాతో చేతులు కలపండి.. తెలంగాణను అమృత సరోవరంలా మార్చిచూపిస్తామన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. తెలంగాణలో 26 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన గడ్కరీ.. ఎన్‌హెచ్‌-363ని జాతికి అంకితం చేశారు. ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాలోనే 3వేల 900కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధిలో ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందుందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ఓవైపు విమర్శిస్తూ.. మరోవైపు నితిన్ గడ్కరీ బహిరంగ సభలో రాష్ట్ర మంత్రుల సమక్షంలో తెలంగాణ అభివృద్ధికోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు మంత్రి కిషన్ రెడ్డి. అయితే అంబర్ పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రం అదనపు నిధులు కేటాయించి స్టీల్ బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టినా పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు GHMC అధికారులు సహకరించడం లేదని కొన్ని రోజుల క్రితం విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు నేరుగా అంబర్‌పేట్‌ మీటింగ్‌లో మంత్రి కోమటిరెడ్డి, మంత్రి పొన్నంకి రోడ్లు, ఫ్లై ఓవర్‌కు భూ సేకరణ కోసం సహకరించాలని కోరారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఆసక్తిగా ఉన్నా.. రాష్ట్ర  ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదంటూ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్ చేసింది బీజేపీ. ఇదే టైమ్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై చర్చించారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు రేవంత్‌ రెడ్డి.