CM Revanth: ‘వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు’.. జనజాతర సభలో సీఎం రేవంత్..

|

Apr 24, 2024 | 9:43 PM

తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. వరంగల్‌ జనజాతర సభలో పాల్గొన్న ఆయన.. కడియం కావ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే వరంగల్‌కి ఎన్నో అభివృద్ధి హామీలిచ్చారు. వరంగల్‌కి ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు.. ఎయిర్‌పోర్టు తీసుకొస్తామన్నారు సీఎం.

CM Revanth: వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు.. జనజాతర సభలో సీఎం రేవంత్..
CM Revanth Reddy
Follow us on

తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. వరంగల్‌ జనజాతర సభలో పాల్గొన్న ఆయన.. కడియం కావ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే వరంగల్‌కి ఎన్నో అభివృద్ధి హామీలిచ్చారు. వరంగల్‌కి ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు.. ఎయిర్‌పోర్టు తీసుకొస్తామన్నారు సీఎం. వరంగల్‌ను ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా తీర్చిదిద్ది ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమన్నారు రేవంత్‌రెడ్డి. అలా జరగాలంటే వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య భారీ మెజారిటీతో గెలవాలన్నారు. పర్యాటకంగానూ వరంగల్‌ను డెవలప్‌ చేస్తామన్నారు సీఎం రేవంత్. అలాగే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేయడంతోపాటు.. టెక్స్‌టైల్‌ పార్క్‌ను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మొత్తంగా.. వరంగల్‌పై వరాలు కురిపిస్తూనే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనన్నారు. ఇద్దరు కలిసి తెలంగాణపై కుట్ర చేశారని ఫైర్‌ అయ్యారు రేవంత్‌రెడ్డి.

పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..