Telangana: సచివాలయంలో వాస్తు మార్పులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ఆ అంతస్తులోనే ఎందుకంటే..

తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఎంట్రీ, ఎగ్జిట్‌లతోపాటు.. మరికొన్ని మార్పులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 6నెలలు కావొస్తోంది. అయితే.. రేవంత్‌రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టి పాలనపై ఫోకస్‌ చేసే లోపే పార్లమెంట్‌ ఎన్నికలు హడావుడి మొదలైంది.

Telangana: సచివాలయంలో వాస్తు మార్పులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ఆ అంతస్తులోనే ఎందుకంటే..
Telangana

Updated on: Jun 03, 2024 | 8:31 PM

తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఎంట్రీ, ఎగ్జిట్‌లతోపాటు.. మరికొన్ని మార్పులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 6నెలలు కావొస్తోంది. అయితే.. రేవంత్‌రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టి పాలనపై ఫోకస్‌ చేసే లోపే పార్లమెంట్‌ ఎన్నికలు హడావుడి మొదలైంది. దాంతో.. ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించి.. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు రచించారు. దానికి సంబంధించి రేపటి కౌంటింగ్‌తో క్లారిటీ రాబోతోంది. కానీ.. పార్లమెంట్‌ ఎన్నికలు ముగియగానే.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఫోకస్‌ పెట్టి.. పాలనకు సంబంధించిన పలు కీలక మార్పులు- చేర్పులతో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెంచేశారు. స్టేట్‌ ఐడెంటిటీని టీఎస్ నుంచి టీజీగా మార్పులు చేశారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులకు నిర్ణయించారు. అయితే.. పలు వివాదాల మధ్యే రాష్ట్ర గీతాన్ని.. ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేశారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన రాజముద్ర మార్పుపై పెద్ద దుమారం రేగడంతో ప్రజాభిప్రాయానికి వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ సచివాలయంలోకి సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ఎంట్రీ మార్చబోతున్నారు. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం కాన్వాయ్.. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి.. ఈస్ట్ గేట్ ద్వారా బయటకు వెళ్లనుంది. అటు.. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు సౌత్‌ గేటు నుంచి రాకపోకలు సాగించనున్నారు. ఇక.. రేవంత్.. సీఎం అయ్యాక తొలిసారి వాస్తు మార్పులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే.. సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయం 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మారింది. దానికి అనుగుణంగానే.. ప్రస్తుతం సెక్రటేరియట్‌లోని 9వ అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు.. సచివాలయంలో రేవంత్‌ ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేయించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..