Telangana Formation Day: అమరవీరులకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్  నివాళులర్పించారు.

Telangana Formation Day: అమరవీరులకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..
Telangana Formation Day Kcr

Updated on: Jun 02, 2021 | 11:18 AM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్  నివాళులర్పించారు. అనంతరం గన్‌ పార్క్‌ నుంచి నేరుగా ప్రగతిభవన్‌ చేరుకొని ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని… జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి  నేపథ్యంలో వరుసగా రెండో సంవత్సరం కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా సాగుతున్నాయి. ఇక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

Cm Kcr Janda

తెలంగాణ ప్రజలకు ఉప రాష్ట్రపతి, ప్రధాని  శుభాకాంక్షలు …

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రదాని ట్వీట్‌ చేశారు. ఘ‌న‌మైన చ‌రిత్ర, విశిష్ట సంస్కృతుల‌కు తెలంగాణ నిల‌య‌మని వెంకయ్యనాయుడు అన్నారు.

రాష్ట్రం స‌హ‌జ వ‌న‌రులు, నైపుణ్యం క‌లిగిన మాన‌వ వ‌నరులను క‌లిగి ఉంద‌ని కొనియాడారు. రాష్ట్ర ప్రజ‌ల ఆరోగ్యం, శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.

తెలంగాణ ప్రజ‌లు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌న్నారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి : Yash to Donate: సినీ కార్మికుల ఖాతాల్లో నేరుగా డబ్బులు.. కోటిన్నర ఆర్ధిక సాయం అందించిన KGF స్టార్ యష్

అమ్మోనా కోడలా… బతికిపోతావా..! కోడలిని కౌగిలించుకున్న అత్త..! కట్ చేస్తే..!

Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధం.. రాజన్న సిరిసిల్లలో జెండా ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్

Petrol Diesel Price Today: ఏపీలో రూ.100 దాటిన పెట్రోల్ ధర.. మరి మన నగరంలో ఎలా ఉందో తెలసుకోండి..