Telangana: రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. రేపటినుంచే రుణ మాఫీ అమలు..

Telangana Crop Loan Waiver: కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో చెప్పిన దాని ప్రకారం.. రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణాల మాఫీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపటి నుంచి (ఆగస్తు 3) రైతుల రుణ మాఫీ అమలు చేయనున్నట్లు తెలిపారు.

Telangana: రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. రేపటినుంచే రుణ మాఫీ అమలు..
CM KCR

Updated on: Aug 02, 2023 | 6:47 PM

హైదరాబాద్, ఆగస్టు 3: కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో చెప్పిన దాని ప్రకారం.. రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణాల మాఫీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపటి నుంచి (ఆగస్తు 3) రైతుల రుణ మాఫీ అమలు చేయనున్నట్లు తెలిపారు. తొలి విడతలో 19 వేల కోట్ల రుపాయల రుణాల మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇది రేపటినుంచే అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నోట్ల రద్దు, కరోనా కారణంగా రైతు రుణాల మాఫీ ఆలస్యం అయిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా రూ. లక్ష రూపాయల రుణ మాఫీ అమలు కానుంది. బుధవారం అధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం.. అధికారులు రేపటినుంచి రైతులకు రుణాల మాఫీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ వరకు విడతల వారిగా రైతులకు రుణాల మాఫీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబరు రెండో వారం వరకు చెక్కులు పంపిణీ పూర్తికానుంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధం చేసింది.

గ్రామాల వారీగా, మండలాలు, జిల్లాలు వారీగా రైతుల బ్యాంకు రుణాలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పటికే అధికారులు సేకరించారు. లక్ష లోపు లేదా లక్ష రూపాయల వరకు తీసుకున్న వారికి రుణం మాఫీ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..