AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పోయేకాలం దగ్గరపడ్డదనుకుంటా.. ఒళ్లుగగుర్పొడిచే వీడియోను షేర్ చేసిన సజ్జనార్..

ముఖ్యంగా సోషల్ మీడియాలో వింత పోస్ట్‌లు పెట్టడం, లేకపోతే ఏదో ఒక రిస్క్ చేసి దాన్ని అప్లోడ్ చేసి లైక్‌లు, కామెంట్ల కోసం పాకులాడటం మనం చూస్తూనే ఉన్నాం.. రీల్స్ కోసం పాకులాడి కొందరు ప్రాణాలు పొగొట్టుకున్నా.. మరికొందరు మాత్రం ఇదే ధొరణిని అవలంభిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుత కాలంలో ఒక రోగంగా మారింది.

Viral Video: పోయేకాలం దగ్గరపడ్డదనుకుంటా.. ఒళ్లుగగుర్పొడిచే వీడియోను షేర్ చేసిన సజ్జనార్..
Man Stunt Viral Video
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 02, 2023 | 4:44 PM

Share

Man Stunt Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింత పోకడలు మరింత పెరిగాయి. అందరినీ ఆకట్టుకోవాలి.. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేసే పనులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వింత పోస్ట్‌లు పెట్టడం, లేకపోతే ఏదో ఒక రిస్క్ చేసి దాన్ని అప్లోడ్ చేసి లైక్‌లు, కామెంట్ల కోసం పాకులాడటం మనం చూస్తూనే ఉన్నాం.. రీల్స్ కోసం పాకులాడి కొందరు ప్రాణాలు పొగొట్టుకున్నా.. మరికొందరు మాత్రం ఇదే ధొరణిని అవలంభిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుత కాలంలో ఒక రోగంగా మారింది. అయితే, తాజాగా.. ఓ యువకుడికి ఈ పిచ్చి మరింత ముదిరింది. ఫేమస్ అవ్వాలనుకుని రైలు పట్టాలపై పడుకున్నాడు.. సోషల్ మీడియాలో రీల్ కోసం భ యువకుడు రన్నింగ్ ట్రైన్ కింద పడుకున్నాడు.. ట్రైన్ వెళ్లి పోయిన తర్వాత.. ఏదో సాధించినట్లు హీరోలా ఎగిరిగంతులు వేశాడు.. కొంచెం అటు ఇటయినా.. ప్రాణం పోయేది.. ఇలాంటి వద్దని వారిస్తున్నప్పటికీ.. చాలా మంది ఇదే ధోరణిని అవలంభిస్తుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియోను ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేసి యువతకు పలు సూచనలు చేశారు.

సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం పిచ్చిపనులు చేయొద్దంటూ సజ్జనార్ హితవు పలికారు. రైల్వే ట్రాక్ పై రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని రీల్స్ చేసిన యువకుడి వీడియోను సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘‘సోషల్ మీడియాలో పాపులర్‌ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?’’ అంటూ సజ్జనార్ ట్విట్టర్ లో రాశారు. అలాంటి వారందరికీ సజ్జనార్ పోస్ట్ ఒక కనువిప్పు లాంటిది. ముఖ్యంగా యువతలో సజ్జానార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. సజ్జనార్ చేసిన మెసేజ్‌తో అయినా.. అలాంటి వారు మారాలని ఆశిద్దాం..

ఈ వీడియోలో ఒక యువకుడు రీల్స్ కోసం ట్రైన్ వచ్చే సమయంలో పట్టాలపై పడుకుంటాడు.. ట్రైన్ స్పీడుతో వెళ్తోంది. ట్రైన్ వెళ్లే వరకు అతను అక్కడే ఉంటాడు. చివరకు ట్రైన్ వెళ్లిన తర్వాత ఎగిరి గంతులేస్తాడు. అయితే, ఈ వీడియో చూసిన వారికి ఈ యువకుడి ప్రాణం ఉంటుందా..? పోతుందా..? అన్న భయం కలుగుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..