AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోల కన్నా బాగా చేశానని ఆ సినిమాల్లో నా సీన్స్ తీసేశారు.. చాలా బాధపడ్డా : బాబ్లూ పృథ్విరాజ్

ప్రముఖ నటుడు బాబ్లూ పృథ్విరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్‌లోని కొన్ని చేదు అనుభవాలను, అలాగే వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. తాను ఎంతో కష్టపడి నటించిన సన్నివేశాలు సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌లో లేకుండా పోవడం వెనుక ఆశ్చర్యకరమైన కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

హీరోల కన్నా బాగా చేశానని ఆ సినిమాల్లో నా సీన్స్ తీసేశారు.. చాలా బాధపడ్డా : బాబ్లూ పృథ్విరాజ్
Babloo Prithiveeraj
Rajeev Rayala
|

Updated on: Nov 03, 2026 | 7:40 AM

Share

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటేనే నటుడిగా నిలదొక్కుకోగలరు. అయితే కొంతమంది నటులకు కెరీర్ పరంగా ఎదురయ్యే సమస్యలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి వారిలో ప్రముఖ నటుడు బాబ్లూ పృథ్విరాజ్ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను కూడా వెల్లడించారు. ముఖ్యంగా తన కుమారుడు అహద్‌కు ఆటిజం ఉన్న విషయం తెలిసిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో వివరించారు.

బాబ్లూ పృథ్విరాజ్ తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నటుడిగా ప్రతి సినిమాకు పూర్తి అంకితభావంతో పనిచేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆయన కష్టానికి తగిన గుర్తింపు లభించలేదని తెలిపారు. తాను ఎంతో కష్టపడి నటించిన సన్నివేశాలు సినిమా ఫైనల్ ఎడిటింగ్‌లో లేకుండా పోయేవని పృథ్విరాజ్ వెల్లడించారు. తన నటన ఇతర నటులను డామినేట్ చేస్తుందనే అభిప్రాయంతో కొందరు తన సన్నివేశాలను తొలగించేవారని ఆయన చెప్పుకొచ్చారు. 1000 శాతం అంకితభావంతో పనిచేస్తా.. తాను ఏ సినిమా చేసినా వంద శాతం కాదు.. వెయ్యి శాతం అంకితభావంతో పనిచేస్తానని పృథ్విరాజ్ తెలిపారు. తన పాత్రకు న్యాయం చేయడమే తన లక్ష్యమని, అంతేకానీ ఇతర నటులను డామినేట్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

వైజాగ్‌లో చిత్రీకరించిన ఓ సన్నివేశం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాదాపు నాలుగు పేజీల డైలాగ్స్ కూడిన ఆ సన్నివేశాన్ని ఒకే షాట్‌లో చిత్రీకరించారట. సినిమాలో కీలకమైన మలుపుగా నిలవాల్సిన ఆ సన్నివేశాన్ని చివరకు తొలగించడంతో కథ స్వరూపమే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన నటనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం, కష్టపడి చేసిన సన్నివేశాలు తొలగిపోవడం వంటి అనుభవాలు తనను బాధించాయని పృథ్విరాజ్ తెలిపారు. ఇలాంటి పరిణామాల కారణంగా కొంతకాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. చాలామంది తన సినీ కెరీర్‌లో గ్యాప్ రావడానికి అవకాశాలు తగ్గడమే కారణమని భావించారని పృథ్విరాజ్ తెలిపారు. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితులే సినిమాలకు దూరం కావడానికి ప్రధాన కారణమని చెప్పారు. తన కుమారుడు అహద్‌కు ఆటిజం ఉన్నట్లు తెలియడంతో అతడి సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చిందని వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హీరోల కన్నా బాగా చేశానని ఆ సినిమాల్లో నా సీన్స్ తీసేశారు..
హీరోల కన్నా బాగా చేశానని ఆ సినిమాల్లో నా సీన్స్ తీసేశారు..
పురపోరు ఫలితాలు.. బ్యాలెట్‌ కౌంటింగ్‌లో ఐదు దశలు ఇవే!
పురపోరు ఫలితాలు.. బ్యాలెట్‌ కౌంటింగ్‌లో ఐదు దశలు ఇవే!
సినిమాల జాతకం మాకు ముందే తెలిసిపోతుంది..
సినిమాల జాతకం మాకు ముందే తెలిసిపోతుంది..
గొంతులోని కఫాన్ని కరిగించి, జలుబుకు చెక్ పెట్టే మిరియాల పులిహోర
గొంతులోని కఫాన్ని కరిగించి, జలుబుకు చెక్ పెట్టే మిరియాల పులిహోర
గ్యాస్ సిలిండర్ల డెలివరీలకు ఇకపై ఓటీపీ అక్కర్లేదు.. నో టెన్షన్
గ్యాస్ సిలిండర్ల డెలివరీలకు ఇకపై ఓటీపీ అక్కర్లేదు.. నో టెన్షన్
కాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలిచేదవరో!
కాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలిచేదవరో!
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన దిగ్గజ ప్లేయర్.. ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన దిగ్గజ ప్లేయర్.. ఎవరంటే?
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురుసు తుఫాను..
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురుసు తుఫాను..
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు
గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. దీపావళి క్రమంలో ధరల్లో మార్పులు
గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. దీపావళి క్రమంలో ధరల్లో మార్పులు